డ్యూటీ చేయకున్నా డాక్టర్ కు సోకిన కరోనా,మృతి

ఇప్పటివరకు డ్యూటీ చేసిన డాక్టర్ల కే కరోనా సోకిన ఘటనల గురించి వినే ఉంటాం.కానీ కరోనా డ్యూటీ చేయని ఒక డాక్టర్ కు కరోనా సోకి మృతి చెందడం తీవ్ర కలకలం సృష్టించింది.

 Indore Doctor Passed Away With Corona, Madhya Pradesh, Corona Virus, Indore, Aus-TeluguStop.com

ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో చోటుచేసుకుంది.ఇప్పటివరకు ఈ కరోనా వ్యాధి సోకి భారతదేశంలో ఎందరో సామాన్యులు బలవ్వగా దేశంలోనే తొలిసారిగా ఒక డాక్టర్ కరోనా కాటుకు బలయ్యాడు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉదయం 4 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.అయితే ఒక ఫేమస్ ఫిజీషియన్ అయిన ఆయన ఎప్పుడూ కూడా కరోనా డ్యూటీ అనేది చేయలేదు.

అలాంటిది ఆయనకు కరోనా సోకి మృతి చెందడం తీవ్ర కలకలం సృష్టించింది.ఇండోర్ కు చెందిన డాక్ట‌ర్ శ‌త్రుఘ్న పంజ్‌వానీ(62) ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు.

అయితే ఆయనకు పరీక్షలు చేయగా కరోనా సోకినట్టు నిర్థారణ అయింది.దీనితో వెంటనే ఆయనను ఐసోలేషన్‌ కు తరలించి చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి మరణించినట్లు తెలుస్తుంది.

కరోనా డ్యూటీలో ఆయన లేనప్పటికీ అతనికి వైరస్ సోకడం తో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఫేమస్ ఫిజిషియన్.

ఆయన ఎక్కువగా మురికివాడల్లో ఉండే వారికే వైద్యం చేస్తూ ఉంటారని,వారిలో ఎవరి నుంచైనా సోకి ఉంటుందని తోటి డాక్టర్లు అనుమానిస్తున్నారు.కాగా మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉండగా, వీరంతా ఆస్ట్రేలియాలోనే ఉంటున్నట్లు తెలుస్తుంది.

కాగా ఇండోర్‌లో ఇప్పటివరకు 173 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 16 మంది చనిపోయారు.అయితే ఒక డాక్టర్ ఇలా కరోనాకు బలికావడం దేశంలోనే ఇది తొలికేసు అని అధికారులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube