సినిమా బడ్జెట్ కంటే కరీనా దుస్తుల ఖరీదెక్కువ.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

గత రెండు దశాబ్దాల క్రితం విడుదలైనటువంటి బాలీవుడ్ చిత్రం చాందినీ బార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాలీవుడ్‌ దర్శకుడు మధుర్‌ భండార్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

 Madhur Bhandarkar Once Joked Kareena Kapoors Clothes Heroine Cost More Entire, K-TeluguStop.com

ఈ సినిమా విడుదలై సెప్టెంబర్ 28 కి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు భండార్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు జాతీయస్థాయి అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి దర్శకుడు మధుర్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

భండార్కర్‌ మాట్లాడుతూ.చాందినీ బార్ సినిమా షూటింగ్ తీసినప్పటికీ ఈ సినిమా బడ్జెట్ 1.5 కోట్లు అయ్యిందని, అయితే ఈ సినిమా బడ్జెట్ హీరోయిన్ కరీనా కపూర్ దుస్తుల కంటే తక్కువ బడ్జెట్లోనే చిత్ర నిర్మాణం జరిగిందని, ఈ సందర్భంగా సినిమా కన్నా కరీనా దుస్తులకే ఎక్కువ బడ్జెట్ అయిందనీ బెబోతో చెబుతూ జోక్‌ చేసేవాడిని ఈ సందర్భంగా దర్శకుడు వెల్లడించారు.అదే విధంగా ఈ సినిమా టైటిల్ విడుదల చేసే సమయంలో టైటిల్ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరిగాయని ఈ సందర్భంగా మధుర్ సినిమా టైటిల్ గురించి మరొక విషయాన్ని వెల్లడించారు.

Telugu Bollywood, Kareena Kapoor-Movie

ఈ సినిమా టైటిల్ పేరు వినగానే చాలామంది బి గ్రేడ్ మూవీగా భావించారని ఈ సందర్భంలో డైరెక్టర్ తెలియజేశారు.ఈ క్రమంలోనే ఆరు నెలల పాటు అత్యంత పరిశోధనలను చేసిన అనంతరం తీసిన ఈ సినిమాకు జాతీయస్థాయి అవార్డు రావడం నిజంగా సంతోషంగా ఉందని వెల్లడించారు.ఈ సినిమా తర్వాత దర్శకుడు భండార్కర్‌ తీసిన సినిమాలన్నీ ఆయనకుసమయోచిత, వాస్తవిక, కష్టతరమైన చిత్ర దర్శకుడిగా గుర్తింపు సంపాదించి పెట్టాయి.

తాను దర్శకత్వం వహించిన రెండవ సినిమా చాందినీ బార్ కి ఇలా జాతీయస్థాయి అవార్డు రావడం గమనార్హం.ఇకపోతే ప్రస్తుతం భండార్కర్‌ ఇండియా లాక్‌డౌన్‌ అనే మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube