వెబ్ సిరీస్ గా మారబోతున్న మధుబాబు ఫిక్షన్ షాడో నవల

ఒకప్పుడు తెలుగు నవలలకి చాలా ప్రాధాన్యత ఉండేది.ప్రజలు నవలలు విపరీతంగా చదివేవారు.

 Madhubabu Shadow Novels As Web Series On Ott, Tollywood, Telugu Cinema, Digital-TeluguStop.com

అలాగే సినిమాలు కూడా నవలల ఆధారంగా తెరకెక్కేవి.అయితే ఈ మధ్య కాలంలో కథా రచయితలకి ప్రాధాన్యత పెరిగింది.

అలాగే నవల కథలని సినిమాగా తీస్తే సాగదీసినట్లు అవుతుందని దర్శకులు కూడా భావిస్తున్నారు.అదే సమయంలో ప్రెజెంట్ ట్రెండ్ కి తగ్గట్లు నవలలు రాసే రచయితలు తగ్గిపోయారు.

ఒకవేళ రచనా సామర్ధ్యం ఉన్న సినిమాలకి కథలు రాసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.అయితే అప్పట్లో మధుబాబు రాసిన షాడో నవల సీరియల్ సూపర్ హిట్ అయ్యింది.

ఫిక్షన్ పాత్ర అయిన షాడో జేమ్స్ బాండ్ తరహాలో ఉంటుంది.

అయితే ఇప్పుడు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ రంగం పుంజుకోవడంతో అలాంటి ఫిక్షన్ నవలలకి ప్రాధాన్యత పెరుగుతుంది.

ఈ నేపధ్యంలో నిర్మాత అనిల్ సుంకర మధుబాబు ఫిక్షన్ షాడో ఆధారంగా వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారు.షాడో క్యారెక్టర్ సిరీస్ ను అందించాలని, ఆ పాత్ర సృష్టికర్త అయిన మధుబాబుతో స్క్రిప్ట్ చేయిస్తున్నారు.

షాడో పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకులకి రీచ్ అవుతుంది.ఇక ఆ పాత్రకి తగిన హీరో కోసం ఇప్పుడు వెదుకుతున్నారు.

అయితే గోపీచంద్, లేదంటే బెల్లంకొండ శ్రీనివాస్ బెటర్ అని భావిస్తున్నారు.అలాగే బడ్జెట్ పరంగా చూసుకున్న సినిమా స్థాయిలోనే ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఈ నేపధ్యంలో నిర్మాత ఆ సాహసం చేయడంతో పాటు కమర్షియల్ హీరోలని ఈ వెబ్ సిరీస్ కోసం ఒప్పించాలి.మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందో అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube