కంగనాకి నా మద్దతు అంటున్న మాధవీలత  

Madhavi latha Support Kangana Fight, Tollywood, Bollywood, Madhavi Latha, Kangana Ranaut, Shiv Sena, Drugs Mafia - Telugu @kanganateam, Bollywood, Drugs Mafia, Kangana Ranaut, Madhavi Latha, Madhavi Latha Support Kangana Fight, Shiv Sena, Tollywood

గత కొంత కాలంగా సుశాంత్ ఆత్మహత్య ఇష్యూలో బాలీవుడ్ మాఫియాని టార్గెట్ చేసిన కంగనా రనౌత్ పెద్ద యుద్ధమే చేస్తుంది.ఒంటరిగా ఆమె బాలీవుడ్ ని శాసిస్తున్న విద్రోహ శక్తులతో ఫైట్ చేస్తుంది.

TeluguStop.com - Madhavi Latha Support Kangana Fight

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అదే సమయంలో సుశాంత్ ఆత్మహత్య కేసుని నీరుగార్చే ప్రయత్నం చేసిన ముంబై పోలీసులపై, మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేనని టార్గెట్ చేయడం ద్వారా ఆమెపై శివసేన పార్టీ ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది.ఈ నేపధ్యంలో అన్ని రకాలుగా కంగనాని ఇబ్బంది పెడుతుంది.

TeluguStop.com - కంగనాకి నా మద్దతు అంటున్న మాధవీలత-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ముంబైలో ఆమె సినిమా ఆఫీస్ అక్రమ కట్టడం అంటూ సగం కూల్చేశారు.ఇప్పుడు ఆమె ఇల్లు కూడా అక్రమ కట్టడమే అంటూ నోటీసులు ఇచ్చారు.

బాలీవుడ్ లో డ్రగ్స్ మాఫియాకి, అక్కడ ఒకవర్గంకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్న ఒంటరి మహిళని ఇంతగా టార్గెట్ చేయడంతో సోషల్ మీడియాలో చాలా మంది ఆమెకి మద్దతుగా నిలబడుతున్నారు.కంగనాకి లభిస్తున్న మద్దతు రోజురోజుకి పెరుగుతుంది.

తనపై ప్రతీకారం తీర్చుకుంటున్న శివసేన పార్టీకి కంగనా కూడా గట్టి సవాల్ విసిరింది.కచ్చితంగా శివసేనకి భవిష్యత్తు లేకుండా చేయాలని కంకణం కట్టుకుంది.ఈ నేపధ్యంలో వారిని పొలిటికల్ గా ఎదుర్కోవడానికి రెడీ అవుతుందనే మాట ఇప్పుడు దేశ వ్యాప్తంగా వినిపిస్తుంది.ఇదిలా ఉంటే టాలీవుడ్ సినీ నటి, బీజేపీ లీడర్ మాధవీలత కూడా తాజాగా కంగానాకి మద్దతుగా ఒక వీడియో రిలీజ్ చేస్తుంది.

టాలీవుడ్ లో కూడా డ్రగ్స్ కల్చర్ ఉందని గత కొంత కాలంగా మొత్తుకుంటున్న ఆమె కంగనా చేస్తున్న ఫైట్ కి తన సపోర్ట్ ఉంటుందని, ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇవ్వాలని వీడియో ద్వారా కోరింది. నేను మాధవీలతను.

భరతమాత పుత్రికను.అన్ని జాతి విద్రోహశక్తులకు వ్యతిరేకంగా కంగనాకు చివరి వరకు మద్దతుగా నిలుస్తాను.జై మాతా దీ అంటూ మాధవీలత వీడియోలో నినదించారు.ఇవాళ కంగనాకు మద్దతిస్తాను, రేపు మీకు అంటూ పేర్కొన్నారు. కంగనాకు న్యాయం జరగాలని, అందరూ ఆమెకు మద్దతు పలకాలని మాధవీలత విజ్ఞప్తి చేశారు.

#@KanganaTeam #Kangana Ranaut #Madhavi Latha #Shiv Sena #MadhaviLatha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Madhavi Latha Support Kangana Fight Related Telugu News,Photos/Pics,Images..