పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మాధవీలత  

Madhavi Latha Gives Clarity On Marriage Rumors - Telugu Heroines,, South Cinema, Telugu Cinema, Tollywood

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా పాపులర్ అయిన నటి మాధవీలత.తెలుగమ్మాయి అయిన మాధవీలత కెరియర్ ఆరంభంలో భాగానే అవకాశాలు తెచ్చుకున్న తరువాత అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.

 Madhavi Latha Gives Clarity On Marriage Rumors

ఆ తరువాత యూఎస్ వెళ్ళిపోయి అక్కడ కొంత కాలం ఉన్న మాధవీలత మరల ఇండియా వచ్చి ఇక్కడ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది.ఇండస్ట్రీలో మీటూ ప్రకంపనలు ఉన్న సమయంలో మీడియా ఎక్కువ ఈమెని ఫోకస్ చేసింది.

తరువాత బీజేపీ పార్టీలో చేరి గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది.అయితే ప్రస్తుతం రాజకీయాలలో అంతగా యాక్టివ్ గా లేకపోయినా సోషల్ మీడియాలో తరుచుగా ఏదో ఒక విషయం మీద రెస్పాండ్ అవుతూ పాపులారిటీ పెంచుకుంటుంది.

పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మాధవీలత-Movie-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం ఈ భామ చేతిలో సినిమాలు పెద్దగా లేకపోయినా మీడియాలో మాత్రం హాట్ టాపిక్ గా ఉంటుంది.

చాలా నెలల తరవాత నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను.

కొత్త జీవితం మొదలైంది.మిరాకిల్ జరిగింది.

నేను ఎప్పుడూ మిరాకిల్స్‌ను నమ్ముతాను.చాలా చాలా చాలా ఆనందంగా ఉన్నాను.

త్వరలోనే ప్రకటన చేస్తాను అని ట్విట్టర్ లో తాజాగా పోస్ట్ చేసింది.ఆమె పెట్టిన ఈ పోస్ట్ పెళ్లి గురించే అని పెద్ద చర్చ నడిచింది.

ఈ వార్తలపై మాధవీలత తాజా క్లారిటీ ఇచ్చింది.ఇందులో ఏ మాత్రం నిజం లేదని, తన పెళ్లి ఇప్పట్లో ఉండదని తేల్చిచెప్పింది.

తన స్నేహితులు కంగ్రాట్స్ చేస్తూ పెడుతున్న కామెంట్స్‌ చూసి నవ్వుకుంటున్నానని వెల్లడించింది.ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు తప్ప ఇప్పట్లో పెళ్లి ఊసే లేదని, అన్నీ కుదిరితే 2021లో పెళ్లి చేసుకుంటానని ఆమె పేర్కొంది.

అయితే తన లైఫ్ లో జరిగిన ఆ మిరాకిల్ ఏంటి అన్నది మాత్రం మాధవీలత క్లారిటీ ఇవ్వలేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Madhavi Latha Gives Clarity On Marriage Rumors Related Telugu News,Photos/Pics,Images..

footer-test