నా ప్రపంచం మీరే.. స్టార్ హీరోకు అభిమాని లవ్ ప్రపోజల్‌..?

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటామనే సంగతి తెలిసిందే.ప్రేమికుల దినోత్సవానికి కొన్ని రోజుల ముందు నుంచే ప్రపోజ్ డే, చాక్లెట్ డే పేరుతో ప్రేమికులు ఒక్కో రోజును ఒక్కో డేగా సెలబ్రేట్ చేసుకుంటారు.

 Madhavan Gives Sweetest Reply To Fan Saying Love Propose, Love Propose, Madhavan-TeluguStop.com

వాలెంటైన్స్ డే సమయంలో అభిమానులు కూడా తమ ఫేవరెట్ హీరోహీరోయిన్లకు లవ్ ప్రపోజ్ చేస్తూ ఉంటారు.అయితే స్టార్ హీరో మాధవన్ కు ఒక అభిమాని చేసిన వింత ప్రపోజల్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

పూజ అనే అమ్మాయి ప్రపంచంలో 8 గ్రహాలు, 204 దేశాలు, 7 సముద్రాలు, 7,707 ద్వీపాలు, 7.8 బిలియన్ల ప్రజలు ఉన్నారని.నేను మరణించేవరకు మాధవన్ నే ప్రేమిస్తానని.మాధవన్ నా జీవితం.మాధవన్ నా ప్రపంచం.మాధవన్ నా సౌర వ్యవస్థ అంటూ వినూత్నంగా ప్రపోజ్ డే సందర్భంగా పోస్ట్ చేసింది.

అభిమాని చేసిన వింత ప్రపోజల్ కు హీరో మాధవన్ స్పందించి “మీ ప్రేమకు నా కృతజ్ఞతలు.నిన్ను ఆ దేవుడు చల్లగా చూడాలి” అని పేర్కొన్నారు.

Telugu Love Propose, Madhavan, Nishabdam, Savyasachi-Movie

తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు మాధవన్.ఈ మధ్య కాలంలో మాధవన్ తెలుగులో సవ్యసాచి, నిశ్శబ్దం సినిమాల్లో నటించగా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.వయస్సు పెరుగుతున్నా యంగ్ గా కనిపించే మాధవన్ కు వీరాభిమానులు ఉన్నారు.సినిమాలతో పాటు యాడ్స్ తో కూడా మాధవన్ బిజీగా ఉన్నారు.

ఒకవైపు నటుడిగా సినిమా అవకాశాలతో బిజీగా ఉంటూనే మాధవన్ పలు సినిమాలను నిర్మించడంతో పాటు దర్శకునిగా కూడా వ్యవహరిస్తున్నారు.రాకెట్రీ ది నంబీ ఎఫెక్ట్ అనే మూవీలో మాధవన్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్నాడు.

హిందీ, తమిళ్, ఇంగ్లీష్ భాషలలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube