12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ హీరోతో రొమాన్స్ చేయనున్న 'అనుష్క'.! అప్పట్లోనే ఇద్దరు హీట్ ఎక్కించారు..!  

Madhavan-anushka Reunite After 12 Years-

‘భాగమతి’తో మంచి హిట్ కొట్టిన అనుష్క శెట్టి. కొద్ది నెలలుగా సినిమాలకు దూరంగా, కుటుంబానికి దగ్గరగా ఉంటుంది..

12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ హీరోతో రొమాన్స్ చేయనున్న 'అనుష్క'.! అప్పట్లోనే ఇద్దరు హీట్ ఎక్కించారు..!-Madhavan-Anushka Reunite After 12 Years

ఇటీవల చిన్న ఆకులను కాలికి మెట్టెలుగా పెట్టుకుని పెళ్లికి సిద్ధమవుతున్నట్లు హింట్ ఇచ్చింది. బుధవారం పుట్టిన రోజు నేపథ్యంలో స్వీటీ స్వీట్ న్యూస్ చెబుతుందని అంతా భావించారు. అయితే, ఆమె దీపావళి శుభాకాంక్షలతో సరిపెట్టింది.

అనూష్క పెళ్ళికి సిద్ధం అవుతోందంటూ వదంతులు సృష్టించారు. అనుష్క పుణ్యక్షేత్రాలని దర్శించినా పెళ్లి కోసం అంటూ ప్రచారం చేశారు. కానీ వాస్తవం అది కాదు. అనుష్క తన తదుపరి చిత్రం కోసం సిద్ధం అవుతోంది.

భాగమతి చిత్రం తరువాత కొంచెం బొద్దుగా మారడంతో అనుష్క తన ఫిజిక్ పై దృష్టి పెట్టింది. సహజసిద్ధంగా సన్నబడేందుకు విదేశాల్లో ప్రకృతి వైద్యం చేయించుకుంటోంది..

ఒకప్పుడు తమిళ హీరో మాధవన్ కు రొమాంటిక్ హీరోగా మంచి క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు వివిధ పాత్రలని ఎంచుకుంటున్నారు.

ఇటీవల సవ్యసాచి చిత్రంలో మాధవన్ విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే..

2006 లో విడుదలైన రెండు అనే చిత్రంలో అనుష్క, మాధవన్ జంటగా కనిపించరు. ఈ చిత్రంలో వీరి మధ్య కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది. 12 ఏళ్ల తరువాత మళ్ళీ ఈ జంట వెండి తెరపై మెరవబోతోంది. ప్రముఖ రచయిత ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకుడు అని ప్రచారం జరుగుతోంది. కోన వెంకట్, గోపి మోహన్ ఈ చిత్రానికి రచయితలు. నటుడు సుబ్బరాజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు..

ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది యూఎస్ లో ప్రారంభం అవుతుందని కోన వెంకట్ తెలిపారు.