అంతరాష్ట్ర గంజాయి ముఠాను అరెస్ట్ చేసిన మాదాపూర్ పోలీసులు...

అంతరాష్ట్ర గంజాయి ముఠాను అరెస్ట్ చేసిన మాదాపూర్ పోలీసులుపక్కా సమాచారంతో హైటెక్ సిటీ ఎంఎంటీసీ రైల్వే స్టేషన్ వద్ద ట్రక్ ను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నాం.ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ముగ్గురు గంజాయి ఫెడ్లర్స్ మహమ్మద్ ఇక్భల్, షారూఖ్, మహమ్మద్ సలీమ్ ను అరెస్ట్ చేసిన మాదాపూర్ పోలీసులు.A1 ఇక్భల్ సోదరుడికి చెందిన ట్రక్ గా గుర్తించాము.మరో నిందితుడు బబ్బులాల్ అలియాస్ బబ్లు పరారీలో ఉన్నాడు.

 Madhapur Police Arrest International Smugling Gang, Smugling, Madhapur Police-TeluguStop.com

నిందితుల వద్ద నుండి 55 లక్షల విలువైన 265 కేజీల గంజాయి, ట్రక్ ను సీజ్ చేసిన పోలీసులు.ఈజీమనీ కోసం అలవాటు పడ్డ A1 ఎండీ ఇక్బల్ గంజాయి స్మగ్లింగ్ ను వృత్తిగా మార్చుకున్నాడు… ఈ క్రమంలో ఒడిశాలో గంజాయి కొని ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ కు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నాం.

గంజాయి తరలించడం కోసం నిందితులు ట్రక్ లో ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేశారు.గంజాయి ప్యాకెట్లను చిన్న చిన్న ప్యాకెట్లగా ప్యాక్ చేసి తరలించే ప్రయత్నం చేశారు.

న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో చెకింగ్స్ నడిచాయి…ఈ క్రమంలో ఈనెల 21న రోజువారీ చెకింగ్స్ లో భాగంగా మియపూర్ పీఎస్ లిమిట్స్ లో 800 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నాం.చెకింగ్స్ ఎక్కువ కావడంతో తగ్గాక ఇక్కడ నుండి మీరట్ వెళ్దాం అనుకున్నారు నిందితులు…దీంతో ట్రక్ ను హైటెక్ సిటీ ఎంఎంటీసీ రైల్వే స్టేషన్ సమీపంలో పార్కు చేసుకున్నారు.మాదాపూర్ పోలీసులకు పక్కా సమాచారం రావడంతో రైడ్ చేసి ట్రక్ ను సీజ్ చేసి నిందితులను అరెస్ట్ చేసాము.A1 నిందితుడు మహమ్మద్ ఇక్భల్ ఒడిశా నుండి గంజాయిని కిలో 8 వేలకు కొని 15 వేలకు మీరట్ లో అమ్ముతున్నట్టు గుర్తించాము…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube