విడ్డూరం: అమెరికాలో మాత్రమే రిలీజ్ కాబోతున్న చిన్న సినిమా.. కారణం ఏంటో?  

Madhanam Movie To Release Only In Us-release,telugu Movies,tollywood News,us

తెలుగు స్టార్ హీరోలు తమ మార్కెట్‌ను కేవలం టాలీవుడ్‌ వద్దే కాకుండా ఓవర్సీస్‌లోనూ పెంచుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు.మెగాస్టార్ మొదలుకొని చాలా మంది హీరోలు ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.సినిమా కథ బాగున్నా అక్కడ కలెక్షన్లు కొల్లగొట్టిన దాఖలాలు చాలా తక్కవ.అయితే ఇవేమీ లెక్కచేయకుండా ఓ చిన్న సినిమా యూఎస్‌లో రిలీజ్‌కు రెడీ అయ్యింది.

Madhanam Movie To Release Only In Us-release,telugu Movies,tollywood News,us Telugu Tollywood Movie Cinema Film Latest News Madhanam Movie To Release Only In Us-release Telugu Movies Tollywood News Us-Madhanam Movie To Release Only In US-Release Telugu Movies Tollywood News Us

అయితే ఇక్కవ విశేషం ఏమిటంటే, ఈ సినిమా రిలీజ్ కేవలం అమెరికాలో మాత్రమే జరగనుంది.అంటే తెలుగునాట ప్రేక్షకులు ఈ సినిమాను చూసే అవకాశం లేదు.కేవలం అమెరికాలో మాత్రమే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.ఇంతకీ ఆ సినిమా ఏమిటని అనుకుంటున్నారా? పెద్దగా ప్రాచుర్యం పొందని ‘మధనం’ సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.గుర్తింపు లేని నటీనటులు, దర్శకనిర్మాతలు ఎవరో కూడా తెలియని సినిమాగా వస్తున్న మధనం కేవలం యూఎస్‌లో రిలీజ్ చేయడంలో ఆంతర్యం ఏమిటా అని సినీ విశ్లేషకులు జుట్టు పీక్కుంటున్నారు.

అయితే ఇందులో యూఎస్ ఆడియెన్స్‌ను వావ్ అనిపించే కంటెంట్ ఉంటేనే సినిమాను అక్కడి జనం ఆదరిస్తారు.లేకపోతే ఎన్నో సినిమాల మాదిరిగా ఇది కూడా దిక్కూ దివానం లేకుండా పోతుంది అని అంటున్నారు సినీ క్రిటిక్స్.మరి ఇంత కాన్ఫిడెంట్‌గా సినిమాను కేవలం యూఎస్‌లో రిలీజ్ చేయడం వెనుక చిత్ర యూనిట్ ధీమాగా ఉన్న అంశం ఏమిటో సినిమా రిలీజ్ అయితేనే చెప్పగలం.