శ్రీ రాముడిని మాదవుడిని చేసింది.. అతని సహన గుణమే.. జస్టిస్ ఎన్.వి. రమణ..

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏ.ఆర్.

 Made Sreerama As Madhav His Patience.. Justice N.v. Ramana... Supreme Court, Law-TeluguStop.com

లక్ష్మణన్ సంతాప సభ లో్ ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్ వి రమణ శనివారం వీడియో ద్వారా మాట్లాడుతూ.న్యాయమూర్తులు నిర్భయంగా నిర్ణయాలు తీసుకోవాలని , ఒత్తిళ్లు, ఆటంకాలను ధైర్యంగా ఎదుర్కొని నిలవాలని స్పష్టం చేశారు.

ఒక మనిషి మంచి జీవితాన్ని కొనసాగించాలంటే ఎన్నో గుణాలను అలవరచు కోవాలి.వినయం, ఓర్పు,దయ, కచ్చితమైన కార్యాచరణ, నిరంతరం నేర్చుకుంటూ తనను తాను మెరుగుపరుచుకో గలిగే ఉన్నతమైన లక్షణాలను కలిగి ఉండాలి.

ముఖ్యముగా న్యాయమూర్తులు తమ విలువలకు బలముగా కట్టుబడి నిర్ణయాలు తీసుకోవడంలో నిర్భయంగా ఉండాలి.

ఒత్తిళ్లు ఆటంకాలు అన్ని రకాల సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి.

ప్రజల విశ్వాసమే న్యాయవ్యవస్థకు ఉన్న గొప్ప బలం.నమ్మకం, ఆమోద యోగ్యతలు బలవంతం పెడితే రావు.వాటిని సంపాదించుకోవాలి.మన విలువలే మనకు గొప్ప సంపద.వాటిని ఎప్పుడూ మరిచిపోకూడదు.న్యాయవ్యవస్థ అత్యున్నత స్థాయిలో ఉన్న భారత్ బెంచ్ లు కలిసి… మనకు సమర్థత, నిబద్ధత, నిర్భీతితో కూడిన స్వతంత్ర వ్యవస్థ ను వారసత్వ సంపదగా ఇచ్చాయని జస్టిస్ లక్ష్మణన్ అన్న మాటలను మనమంతా గుర్తుంచుకోవాలి.

ఆయన మాటల నుంచి మనం స్ఫూర్తిని పొంది ప్రస్తుత సమయంలో అత్యవసరమైన శక్తివంతమైన స్వతంత్ర న్యాయ వ్యవస్థ కోసం పాటుపడాలి.అని జస్టిస్ ఎన్వి రమణ పేర్కొన్నారు.

ప్రస్తుత కాలంలో రాముడికి ఉన్న ప్రాధాన్యం గురించి వివరిస్తూ.ఓ మహానుభావుడు నాకు గుర్తుకొస్తున్నాడు.

ప్రజలు రాముణ్ణి కొలవాల్సింది.ఆయన విజయాలను చూసి కాదు.

అత్యంత కష్ట సమయాలను కూడా చాలా సంతోషంగా ఎదుర్కొన్న విధానాన్ని చూసి.అదే విలువలకు ఇచ్చే గౌరవం.ఒకరి జీవితంలో అత్యంత గొప్ప క్షణాలు అవే.నీకు ఎంత ఉందన్నది ఇక్కడ ప్రశ్న కాదు, నీవు ఏం చేశావు, దాని వల్ల ఏం జరిగింది, ఏం జరగలేదు,ఎలాంటి పరిస్థితులు ఎదురైనా,వాటిని నీవు ఎలా ఎదుర్కొన్నావు అనేదే ముఖ్యం.అదే నీ సత్తా ఏంటో నిర్ణయిస్తుంది.అని జస్టిస్ ఎన్వి రమణ పేర్కొన్నారు.మద్రాస్ బార్ అసోసియేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వినీత్ కొఠారి, మాజీ అటార్నీ జనరల్, సుప్రీంకోర్టు సీనియర్ కె.పరాశరన్, మద్రాస్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది ఎం.రవీంద్రన్ పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube