`టిక్ ‌టాక్`‌ తలదన్నేలా హైదరాబాదీ యాప్.. బంప‌ర్ ఆఫ‌ర్ ఏంటంటే?

చైనాకు చెందిన సోషల్‌మీడియా యాప్ `టిక్ టాక్` భార‌త్‌లో ఎంత పాపుల‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.బైటీ డ్యాన్స్ రూపొందించిన ఆ టిక్ టాక్ యాప్ ద్వారా ఎంద‌రో సామాన్యులు స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకున్నారు.

 Made In Hyderabad App Hy Star For Replacing Tiktok! Tiktok, Hy Star App, India,-TeluguStop.com

చాలా మంది ప్ర‌తిభావంతులు ప్ర‌పంచానికి ప‌రిచ‌య‌మ‌య్యారు.చిన్నాపెద్ద తేడా లేకుండా అంద‌రినీ ఆక‌ట్టుకున్న ఈ టిక్ టాక్ యాప్.

వాట్సాప్, యూట్యూబ్, ఫేస్‌బుక్ లాంటి యాప్స్‌కి గట్టి పోటీ ఇచ్చింది.

అయితే ఇటీవ‌ల భార‌త్ కేంద్ర ప్ర‌భుత్వం‌‌ టిక్‌ టాక్‌‌ను బ్యాన్ చేసిన సంగ‌తి తెలిసింది.

టిక్ టాక్ బ్యాన్ తర్వాత ఎంతోమంది స్టార్లకు దిక్కు తోచడం లేదు.అందుకే చాలామంది ఆల్టర్నేటివ్‌‌ ఫ్లాట్‌‌ఫామ్స్ వెత‌క‌డం మొద‌లు పెట్టారు.దీని క్యాష్ చేసుకునేందుకు ప‌లు సంస్థ‌లు వినూత్నమైన యాప్స్ ను రూపొందిస్తూ.ప్ర‌జ‌ల‌ను ఆకట్టుకునే పనిలో పడ్డాయి.

Telugu China, Hy App, Hyderabad, Hyderabad App, India, Latest, Tiktok-

ఇలాంటి త‌రుణంలో మేడిన్ హైదరాబాద్ యాప్ గా వచ్చిన `హై స్టార్` జ‌ట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది.టిక్ ‌టాక్‌ తలదన్నేలా ఈ యాప్‌ను నగరానికి చెందిన పబ్బాస్ గ్రూప్ రూపొందించింది.చైనాకు చెందిన టిక్ టాక్ యాప్‌లో కేవలం 15 సెకన్ల నిడివి వున్న యాప్స్ మాత్రమే అప్ లోడ్ చేసే అవకాశం ఉండగా.ఈ హైదరాబాదీ `హై స్టార్` యాప్ లో ఒక నిమిషం వీడియోలను అప్ లోడ్ చేయవచ్చని సంస్థ సీఈఓ స్వామి పేర్కొన్నారు.

సాంగ్స్‌, డైలాగ్స్‌, కామెడీ, గేమింగ్‌, ఫుడ్‌, స్పోర్ట్స్‌, మీమ్స్‌… ఇలా ఎన్నో విభిన్న అంశాల్లో వీడియోలు చేసి ఈ హై స్టార్ ద్వారా ప్రదర్శించుకోవచ్చని ఆయ‌న వెల్ల‌డించారు.ఇక్క‌డ మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ఏంటంటే.

ఆ యాప్‌లో స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న వారికి.వివిధ కంపెనీల వాణిజ్య ప్రకటనల్లో అవకాశాలను కల్పిస్తున్నామని సీఈఓ స్వామి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube