మదనపల్లె జంట హత్యల కేసు.. నిందితులకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. !

ఉన్మాదంతో చేసిన పనో, లేక మూడ నమ్మకంతో చేసిన దారుణమో తెలియదు గానీ ఉన్నతమైన విద్యావంతులుగా ఉన్న ఓ జంట కన్న కూతుర్లను అతి కిరాతకంగా బలి తీసుకున్న ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో జనవరి 24న జరిగిన విషయం తెలిసిందే.

కాగా ఈ జంట హత్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి.

ఈ దారుణానికి ఒడిగట్టిన కన్న తల్లిదండ్రులైన పద్మజ, పురుషోత్తంలను కస్టడిలోకి తీసుకున్న పోలీసులు కోర్టుకు హజరు పరచగా వారికి జైలు శిక్ష వింధించింది కోర్టు.కాగా ఈ దంపతులిద్దరూ మానసిక సమస్యలతో బాధపడుతుండటం గమనించిన న్యాయస్దానం మొదట తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో, ఆ తర్వాత విశాఖలోని మానసిక వైద్యశాలలో చికిత్స అందించారు.

అనంతరం మదనపల్లె సబ్ జైలుకు తరలించారు.ఇకపోతే వీరి మీద కేసు నమోదై 90 రోజులు పూర్తి కావడంతో.

వీరిద్దరికీ మదనపల్లె న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.అదికూడా షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.

Advertisement
కెనడాలోని ఎన్ఆర్ఐలకు లాస్ట్ ఛాన్స్ .. ఈ వీకెండ్‌లో చివరి బ్యాచ్ కాన్సులర్ క్యాంప్‌లు

తాజా వార్తలు