మరో ట్విస్ట్‌ ఇచ్చిన మదనపల్లె హత్య కేసు.. ?  

madhanapalli, murders cases, another twist, divya, alekya - Telugu Alekya, Another Twist, Divya, Madhanapalli, Murders Cases

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మదనపల్లె కూతళ్ల హత్య కేసులో ఇప్పటికే ఎన్నో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి.ఈ హత్యకు కారణం అయిన ఆ అమ్మాయిల తల్లిదండ్రులను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్న క్రమంలో మరిన్ని ఆసక్తికర సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయట.

TeluguStop.com - Madanapalle Murder Case Given Another Twist

ఇక తాజాగా తెలిసిన విషయం ఏంటంటే.

ఈ ఘటన మొత్తానికి పెద్దమ్మాయి అలేఖ్య కారణమని ప్రచారం జరుగుతుందట.

గత రెండు వారాల క్రితం బయటకు వెళ్లిన దివ్యకు ఏదో గాలి ఆవహించిందని, మరుసటి రోజు అనారోగ్యం పాలైన దివ్యను చూసి అనుమానం వ్యక్తం చేసిందట అలేఖ్య.ఇక ఇలా జరిగిన రోజు నుండే తాను చనిపోతానన్న భయంలోనే ఉండి పోయిందట దివ్య.

ఈ క్రమంలో దివ్యకు ఆమె తల్లిదండ్రులు భూత వైద్యుడితో తాయెత్తులు కూడా కట్టించారట.అయినా దివ్య మామూలు స్దికి రాకపోవడంతో వేపాకులతో దివ్యను తల్లిదండ్రులు కొట్టారట.

ఇక తాను చనిపోతాను అని కోరుకున్న దివ్య తలపై డంబెల్స్‌తో కొట్టి చంపారట పద్మజ, పురుషోత్తం.ఈ హత్యను పెద్దమ్మాయి అలేఖ్య సపోర్టు చేసిందట.

ఇక దివ్య హత్య జరిగిన రోజు రాత్రి తనను కూడా చంపాలని కోరిన అలేఖ్య పూజ గదిలో గుండు కొట్టుకుని నోటిలో రాగి చెంబు పెట్టుకుని అక్కడే కూర్చుందట.ఇలా కూర్చున్న అలేఖ్యను కూడా డంబెల్స్‌తో కొట్టి చంపారట తల్లిదండ్రులు.

ఇక తాను చనిపోయే ముందు చనిపోయిన చెల్లిని తీసుకువస్తానని తల్లిదండ్రులతో చెప్పినట్లు తెలుస్తుంది.

కాగా ఈ హత్యలకు కారణం పునర్జన్మలపై విశ్వాసమేమని పోలీసులు భావిస్తున్నారట.

ఏది ఏమైన ఉన్న జన్మలో సక్రమంగా జీవించక, ఉన్నాయో, లేదో తెలియని జన్మల కోసం ప్రణాలు తీసుకోవడం దారుణం.

#Divya #Murders Cases #Alekya #Madhanapalli #Another Twist

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు