కోర్టు తీర్పు : టీడీపీ ఎమ్యెల్యే రాజీనామా !

తెలుగుదేశం పార్టీకి చెందిన మడకశిర ఎమ్యెల్యే ఈరన్న ఎమ్యెల్యే సభ్యత్వానికి రాజీనామా చేశారు.ఈ మేరకు శుక్రవారం అమరావతిలో అసెంబ్లీ కార్యదర్శిని కలిసి ఆయన రాజీనామా లేఖను అందజేశారు.

 Madakashira Tdp Mla Eeranna Resignations To Mla Post-TeluguStop.com

కాగా, ఇటీవలే ఈరన్నను సుప్రీంకోర్టు అనర్హుడిగా తేల్చిన విషయం తెలిసిందే.గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఈరన్న… వైసీపీ నుంచి తిప్పేస్వామి పోటీ చేయగా… తిప్పేస్వామిపై ఈరన్న విజయం సాధించారు.

అయితే, ఈరన్న ఎన్నికల అఫిడవిట్‌లో తనపై కర్ణాటకలో నమోదైన క్రిమినల్ కేసులు, తన భార్య ప్రభుత్వ ఉద్యోగి అన్న విషయాన్ని ప్రస్తావించకపోవడంతో తిప్పేస్వామి హైకోర్టును ఆశ్రయించారు.దీంతో ఈరన్న ఎన్నిక చెల్లదని కోర్టు హియరింగ్‌లో తేల్చి.తీర్పు వెలువరించింది.ఎమ్మెల్యేగా తిప్పేస్వామి కొనసాగాలని ఆదేశించింది.ఈ తీర్పును సవాల్ చేస్తూ ఈరన్న సుప్రీంకోర్టును ఆశ్రయించగా.కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube