పిచ్చి పీక్స్.. కొత్త ఫోన్‌ను బండరాయితో మోదిన యువకుడు.. వీడియో వైరల్!

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్‌లను విరివిగా వాడుతున్నారు.ఈ రోజుల్లో సెల్‌ఫోన్ లేని మనుషులు లేరంటే అతిశయోక్తి కాదు.

 Mad Peaks The Young Man Who Hit The New Phone With A Rock Video Goes Viral , New Phone ,stolen , Viral Latest , Viral News , Mad Peaks , Social Media , Viral Video-TeluguStop.com

ప్రధానంగా యువత ఈ రోజుల్లో విపరీతంగా ఫోన్‌లను వాడుతున్నారు.అయితే అందరూ మొబైల్ ఫోన్లను తమ పనులకు వాడుకుంటే మరికొందరు మాత్రం పని పక్కనపెట్టి మరీ సెల్‌ఫోన్‌లలో మునిగి తేలుతున్నారు.

దీని వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయి.ఆడవారు లైంగిక వేధింపులకు గురవుతున్నారు.

 Mad Peaks The Young Man Who Hit The New Phone With A Rock Video Goes Viral , New Phone ,stolen , Viral Latest , Viral News , Mad Peaks , Social Media , Viral Video -పిచ్చి పీక్స్.. కొత్త ఫోన్‌ను బండరాయితో మోదిన యువకుడు.. వీడియో వైరల్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమాయకులు మోసపోతున్నారు.అయితే ఇలాంటి దారుణాలకు దారితీసే ఫోన్ ని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఒక యువకుడు చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు.

అతడు కొత్తగా కొన్న తన సెల్‌ఫోన్‌ను బండరాయితో మోది మరీ నాశనం చేశాడు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువకుడు తన ఫోన్‌ను ఒక బండరాయి మీద ఉంచడం గమనించవచ్చు.అనంతరం అతడు మరో రాయి తీసుకుని ఫోన్‌పై బలంగా కొట్టాడు.

దీంతో ఫోన్ స్క్రీన్ ముక్కలు ముక్కలు అయింది.అయినా కూడా అతడి కోపం తగ్గలేదు.

అలాగే రాయితో అతడు కొడుతూనే ఉన్నాడు.ఈ క్రమంలో ఒక్కసారిగా ఫోన్ నుంచి పెద్ద ఎత్తున పొగలు వెల్లువెత్తాయి.

దీంతో భయపడిపోయిన సదరు యువకుడు అక్కడి నుంచి దూరంగా పరిగెత్తాడు.ఇంతటితో వీడియో ముగుస్తుంది.

దీన్ని చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.అతడు ఫోన్ పగల కొట్టడానికి కారణం ఏంటో కానీ ఇంత కోపం ఉంటే జీవితంలో బాగుపడలేరు అని కామెంట్లు పెడుతున్నారు.

ఫోన్ మీద అంత కోపం ఉంటే దాన్ని అమ్మేస్తే డబ్బులు వస్తాయి కదా.ఇలా పగలగొట్టుకుంటే ఏమి వస్తుంది అని మరి కొందరు కామెంట్ చేశారు.కొందరు మాత్రం పిచ్చి పీక్స్ కి వెళ్ళడం అంటే ఇదేనేమో అని వ్యాఖ్యానిస్తున్నారు.ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube