తాజాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే.దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రచ్చ చేయడం మొదలుపెట్టారు.
లైగర్ పోస్టర్ లో విజయ్ దేవరకొండ లుక్ ను చూసి ఆయన ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయి పండగ జరుపుకుంటున్నారు.
వాస్తవానికి ఎవరైనా అభిమానులు తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అయితే ఆ ఫాన్స్ రచ్చ మామూలుగా ఉండదు.ఆ పోస్టర్ కు పాలాభిషేకం, కొబ్బరి కాయలు కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు కానీ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం ఫస్ట్ లుక్ విడుదల రోజే నన నానా రచ్చా చేస్తున్నారు.ఈ సందర్భంగా విజయ్ ఫాన్స్ ఏకంగా బీర్ తో అభిషేకం చేసి రౌడీ అభిమానులమని నిరూపించుకున్నారు.
లైగర్ పోస్టర్ కు ఇద్దరు అభిమానులు బీర్ తో అభిషేకం చేస్తున్న వీడియోను సినిమా నిర్మాత ఛార్మి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.ఈ పోస్టుకు చార్మి రచ్చ మొదలైంది అంటూ క్యాప్షన్ పెట్టండి.
ఈ వీడియోను చూసిన విజయ్ దేవరకొండ అభిమానులు రౌడీ రచ్చ అంటే మామూలుగా ఉండదు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక మరికొందరైతే ఓవర్ ఎక్కువయింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఈ తరుణంలో బీర్ తో అభిషేకం చేయడం ఏంటి ? పిచ్చి పిక్స్ అంటూ విమర్శలు చేస్తున్నారు.ముందుగా ఈ సినిమాకు ఫైటర్ అనే పేరు అనుకున్నారు.
కానీ, ఫైటర్ అనే సినిమా టైటిల్ వేరే సినిమా వాళ్ళు తీసుకోవడంతో ఈ సినిమాకు ఆ టైటిల్ ఉండేవిధంగా లైగర్ అనే టైటిల్ ను ఖరారు చేసింది చిత్ర యూనిట్.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కు అనన్య పాండ్య జోడిగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.
అలాగే పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొని రాబోతున్న ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
.