పాత ఫార్ములలో వెళ్తున్న మారుతి.. 'పక్కా కమర్షియల్‌' పక్కా హిట్‌

ఈరోజుల్లో బస్టాప్‌ వంటి చిన్న చిత్రాలను కాస్త బూతు దట్టించి తెరకెక్కించిన దర్శకుడు మారుతి భలే భలే మగాడివోయ్‌ నుండి ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గర అయ్యాడు.ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు అంటూ మారుతి కి పేరు వచ్చింది.

 Maaruthi Gopichand Movie Pakka Commercial Story Update-TeluguStop.com

బూతు చిత్రాల దర్శకుడు నుండి మారుతిని ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు అంటూ ఆడియన్స్‌ పిలుస్తున్నారు.ఆయన దర్శకత్వంలో వచ్చిన భలే భలే మగాడివోయ్‌, మహానుభావుడు, ప్రతి రోజు పండుగే సినిమా లు మంచి విజయాలను దక్కించుకున్నాడు.

తాజాగా మరోసారి ఆయన నుండి ఒక ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ మూవీ రాబోతుంది.మారుతి సినిమా అంటే హీరో కు ఏదో ఒక డిఫెక్ట్‌ ఉంటుందని భలే భలే మగాడివోయ్‌ మరియు మహానుభావుడు సినిమా ల తర్వాత ఒక టాక్ వచ్చింది.

 Maaruthi Gopichand Movie Pakka Commercial Story Update-పాత ఫార్ములలో వెళ్తున్న మారుతి.. పక్కా కమర్షియల్‌’ పక్కా హిట్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ప్రతి రోజు పండుగ లో మాత్రం ఆ విషయాన్ని ప్రత్యేకంగా చూపించిందే లేదు.

ప్రతి రోజు పండుగే సినిమా నిరాశ పర్చిన నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా అయిన పక్కా కమర్షియల్ సినిమా లో హీరో ను తన గత సినిమాల్లో మాదిరిగా ఒక డిఫెక్ట్‌ తో చూపించబోతున్నాడు.

అదే కమర్షియల్‌.ఔను ఈ సినిమా లో హీరో ప్రతి విషయాన్ని చాలా కమర్షియల్ గా చూస్తూ ఉంటాడు.అడుగు తీసి అడుగు వేయాలన్నా కూడా కమర్షియల్‌ గా ఏమైనా లాభం ఉంటుందా అని భావిస్తు ఉంటాడు.అలాంటి వ్యక్తి ప్రేమలో పడితే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే నవ్వు వస్తుంది కదా.అలాంటి కథతో దర్శకుడు మారుతి పక్కా కమర్షియల్‌ సినిమా ను గోపీచంద్‌ హీరోగా తెరకెక్కించేందుకు సిద్దం అయ్యాడు.ఈ సినిమా ను తాజాగా ప్రారంభించారు.

షూటింగ్‌ ప్రారంభించక ముందే ఈ సినిమా ను అక్టోబర్ లో విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే.

#BhaleBhale #Mahanubhavudu #FamilyMovies #Geetha Arts 2 #Gopichand

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు