ఆడిషన్ అని చెప్పి అత్యాచారయత్నం చేసారు అంటున్న హీరోయిన్  

Maanvi Gagroo Shares Ordeal About An Audition - Telugu Bollywood, Harassment\\'s,, Metoo

ప్రపంచ వ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీలో మీటూ అనే ఉద్యమం ఎంత సంచలనంగా మారిందో అందరికి తెలిసిందే.ఎంతో మంది ప్రముఖులుగా చెప్పుకునే వారు సినిమా ఇండస్ట్రీలో నటీమణులపై లైంగిక వేధింపులకి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు.

 Maanvi Gagroo Shares Ordeal About An Audition

ఈ మీటూ ఉద్యమం బాలీవుడ్, టాలీవుడ్ లో కూడా ప్రకంపనలు సృష్టించింది.బాలీవుడ్ లో కూడా స్టార్ నటులపై కొంత మంది హీరోయిన్స్, నటీమణులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసారు.

ఇక ఈ ఉద్యమం నుంచి బాలీవుడ్ బయట పడింది అని అనుకునేలోపే ఓ బాలీవుడ్ హీరోయిన్ మరోసారి లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ తెర ముందుకి వచ్చింది.

ఆడిషన్ అని చెప్పి అత్యాచారయత్నం చేసారు అంటున్న హీరోయిన్-Movie-Telugu Tollywood Photo Image

కెరీర్ ఆరంభంలో తాను ఓ ఆడిషన్ కు వెళ్తే ఆ దర్శక నిర్మాతలు తనతో అసభ్యంగా ప్రవర్తించారని ది బాలీవుడ్ హీరోయిన్ మాన్వీ గాగ్రూ ఆరోపణలు చేసింది.

ఈమె కొన్ని హిందీ సినిమాలతో పాటు సీరియల్స్ కూడా చేసింది.తనకు ఎదురైన ఛేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది ఈమె.తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టింది.ఓ సినిమాలో అవకాశం కోసం తాను ఆడిషన్స్ కు వెళ్లానని చెత్తగా ఉన్న ఓ ఆఫీసులో తనను అత్యాచారయత్నం సన్నివేశంలో నటించమని అడిగారని చెప్పింది.

ఆ సన్నివేశం వంకతో అక్కడ ఉన్న ఇద్దరు తనపై నిజంగానే అత్యాచారం చేయడానికి ప్రయత్నించారని చెప్పింది.అయితే అదృష్టం కొద్ది వారి నుంచి తప్పించుకొని వచ్చేసా అని తెలియజేసింది.

అయితే తనపై అలా లైంగిక వేధింపులకి పాల్పడింది ఎవరనే విషయం మాత్రం మాన్వీ చెప్పకపోవడం గమనార్హం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Maanvi Gagroo Shares Ordeal About An Audition Related Telugu News,Photos/Pics,Images..