మా లో మళ్లీ మొదలైన లొల్లి, అధ్యక్షుడు పై ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఆగ్రహం

ఇటీవల ‘మా'(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)డైరీ లాంచింగ్ లో చిన్నపాటి గొడవ జరిగిన సంగతి తెలిసిందే.అయితే అప్పటివరకు మా లో లోపల లోపలే గోడలు ఉంటున్న విషయం తెలిసినప్పటికీ తొలిసారిగా బహిరంగంగా మా లో గొడవలు ఉన్నట్లు అర్ధమైంది.

 Maa Rajashekar Latest Update-TeluguStop.com

అయితే తాజాగా మా అధ్యక్షుడు నరేష్ పై ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మా నిధులను ఆయన దుర్వినియోగం చేస్తున్నారు అని,అంతేకాకుండా మాజీ అధ్యక్షుడు శివాజీ రాజాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటూ వారంతా మండిపడుతున్నారు.

ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ.నరేష్ లోపాలను తప్పుబడుతూ క్రమశిక్షణ సంఘానికి 10 పేజీల లేఖ కూడా రాసినట్లు తెలిపారు.

ఈ లేఖలో 15 మంది ఈసీ కమిటీ సభ్యులు కూడా సంతకం చేశారు.గతంలో శివాజీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు.

నరేష్ కార్యదర్శిగా పనిచేశారు.అప్పటి నుంచి ఇప్పటివరకూ వారు ఏం చేశారో.

అంతా ఈ 10 పేజీల లేఖలో పేర్కొన్నామని తెలిపారు.

దయచేసి క్రమ శిక్షణ సంఘం నరేష్‌ వ్యవహారంపై చర్చలు జరిపి సరైన చర్య తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు.

ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో మా ను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారు అంటూ జీవిత ఆరోపించారు.తప్పనిసరిగా ఆయనపై చర్యలు తీసుకోవాలి అంటూ డిసిప్లీనరీ కమిటీ కి విజ్ఞప్తి చేశారు.

డిసిప్లెయిన్ కమిటీలో ప్రముఖ సీనియర్ నటులు కృష్ణం రాజు, మురళీమోహన్, మోహన్ బాబు, చిరంజీవి, జయసుధలు ఉన్నారు.దీనిపై మరి వారు ఎలా స్పందిస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube