చెప్పింది నాగబాబే కదా.. చిరంజీవి కాదుకదా.. అంటూ బాంబు పేల్చిన నరేష్!

తెలుగు సినీ సీనియర్ నటుడు నరేష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్నా పేరే.ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Maa President Naresh Commnets On Nagababu And Present Situation-TeluguStop.com

ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ సహాయ పాత్రలలో నటిస్తూనే ఉన్నాడు.అంతేకాకుండా ప్రస్తుతం ‘మా’ అధ్యక్ష బాధ్యతలు కూడా చేపడుతున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా నాగబాబు గురించి కొన్ని కామెంట్స్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.అసలు సంగతి ఏమిటంటే సినీ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ప్రెసిడెంట్ గా పోటీలు జరుగుతూనే ఉన్నాయి.

 Maa President Naresh Commnets On Nagababu And Present Situation-చెప్పింది నాగబాబే కదా.. చిరంజీవి కాదుకదా.. అంటూ బాంబు పేల్చిన నరేష్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రెండేళ్ళ కొకసారి జరిగే మా అధ్యక్ష ఎన్నికలు గతేడాది జరగవలసి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది.ఇటీవలే ఎన్నికల గురించి చర్చలు జరగగా కొన్ని రోజుల్లోనే ప్రారంభం కానుంది.

ఈ నేపథ్యంలో పలువురు నటుల ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.తాజాగా సీనియర్ నటుడు నరేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని విషయాలు పంచుకున్నాడు.

రాబోయే ఎన్నికల్లో తాను ఎవరికి మద్దతు తెలుపుతానో ఇంకా నిర్ణయించుకోలేదని అన్నారు.

అంతేకాకుండా ప్రస్తుతం అధ్యక్ష స్థానంలో ఉండటంతో దాని గురించి స్పందించడం సరైనది కాదని తెలిపాడు.కొన్ని రోజుల కిందట నాగబాబు.‘మా మసకబారింది’ అని చేసిన వ్యాఖ్యలు తనను బాగా ఆందోళన చెందేలా చేశాయని అన్నాడు.ఎక్కడ ఎన్నికలు జరిగినా.సపోర్ట్ ఎవరికీ చేస్తారనేది వారి వ్యక్తిగత విషయం పై ఉంటుందని.ప్రతి ఒక్కరూ తమ భావాన్ని తెలియజేయడంలో తప్పు లేదని తెలిపాడు.చెడు ఉంటే చెవిలో చెబుదాం.మంచి ఉంటే మైకులో మాట్లాడదాం అని చిరంజీవి అన్నారని.‘మా’ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే వారిపై చర్యలు తీసుకోవాలనే నిబంధనలు ఉన్నాయని తెలిపాడు.ఒకప్పుడు నాగబాబుతో పాటు పలువురు నటులు కూడా సపోర్ట్ చేశారని.అందరూ కలిసి మద్దతు ఇచ్చే వాళ్ళమని తెలిపాడు.

తను అధ్యక్షుడు అయిన తర్వాత బాగా కష్టపడి పనిచేశానని.ఆరోగ్య భీమా కల్పించానని.ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వెంటనే వాళ్లకు ఆరోగ్య భీమా అందించామని తెలిపాడు.ఇక మళ్లీ పోటీ చేసిన తనే గెలుస్తానని.కానీ కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని తెలిపాడు.ఇక ఈ ఎన్నికలు ఎప్పుడనేది స్పష్టత రాలేదని.

ఏకగ్రీవం చేస్తే, గొంతునులిమి చేసినట్లేనని నాగబాబు అన్నాడని తెలిపాడు.ఇక ప్రస్తుతం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ లు ముందుకు రాగా.

విష్ణు చెప్పిన మాటలు తనకు నచ్చాయని తెలిపాడు.ఇదిలా ఉంటే ప్రకాష్ రాజ్ కు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందన్నా మాటలు నాగబాబు మాత్రమే అన్నాడని.

చిరంజీవి మాత్రం అనలేదని తెలిపాడు.అంతేకాకుండా కులాల పేరుతో రాజకీయాలు జరిగే ఆస్కారం లేదని గట్టిగా తెలిపాడు నరేష్.

#Manchu Vishnu #Chiranjeevi #Comments #Naga Babu #Nagababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు