పవన్ నేను మాట్లాడుకున్నాం.. కావాలంటే చూడండి : విష్ణు

టాలీవుడ్ ఇండస్ట్రీలో మా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా జరిగిన విషయం తెలిసిందే.ఎన్నికలు ముగిసి పది రోజులవుతున్న ఇంకా మా సభ్యుల మధ్య గొడవలు చెలరేగుతూనే ఉన్నాయి.

 Maa President Manchu Vishnu Shares Video Of Pawan Kalyan Details, Alay Balay, Ja-TeluguStop.com

ఎన్నికలు ముగిసిన వీరి మాటల యుద్ధం మాత్రం ముగియడం లేదు.హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు గెలుపొందిన విషయం తెలిసిందే.

అయితే ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా ఎవ్వరు కామ్ గా ఉండడం లేదు.ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు మంచు విష్ణు పై.మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై విమర్శలు చేసుకుంటున్నారు.ఇక ఎన్నికల తర్వాత మంచు విష్ణు ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీకి ఆహ్వానం అందలేదని వీరి రెండు కుటుంబాల మధ్య మళ్ళీ కోల్డ్ వార్ నడుస్తుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ క్రమంలోనే ఇటీవలే హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్ లో నిర్వహించిన అలయ్ బలయ్ కు మా అధ్యక్షుడు మంచు విష్ణు తో పాటు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు.

అయితే ఈ ఈవెంట్ లో పవన్, విష్ణు మాట్లాడుకోలేదని.పక్కపక్కనే కూర్చున్న కూడా కనీసం ఒకరిని మరొకరు పలకరించు కోలేదని వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే ఈ విషయంపై మంచు విష్ణు ఇప్పుడే స్పందించారు.మేము మాట్లాడుకున్నామని పవన్ మంచి సలహాలు కూడా ఇచ్చారని విష్ణు మీడియాకి తెలిపారు.అయితే తాజాగా అలయ్ బలయ్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అందులో పవన్, విష్ణు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని.చాలా సేపు నవ్వుతు మాట్లాడుకున్నారు.

విష్ణుకు పవన్ హగ్ కూడా ఇచ్చాడు.ఇక ఈ వీడియోను విష్ణు షేర్ చేస్తూ తామిద్దరం మాట్లాడుకున్నాం చుడండి అంటి షేర్ చేసాడు.

ప్రెసెంట్ ఈ వీడియో వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube