Manchu Vishnu: ఆర్ఆర్ఆర్ సెలెబ్రేషన్స్ కు హాజరు కాని మంచు విష్ణు.. మా అధ్యక్షుడుపై ట్రోల్స్?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా( RRR ) గత ఏడాది విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకోవడంతోపాటు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామిని సృష్టించింది.

అంతేకాకుండా ఈ సినిమా ఆస్కార్ అవార్డును( Oscar Award ) సైతం అందుకున్న విషయం తెలిసిందే.ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ అవార్డ్స్ ని అందుకున్నారు.ఆస్కార్ వేదికపై రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు.ఈ సినిమా విడుదల అయ్యి ఏడాది పూర్తవుతున్నా కూడా ఈ సినిమాకు సంబంధించిన మీనా ఇంకా తగ్గడం లేదు.

జపాన్ లాంటి దేశాల్లో ఇప్పటికీ ఈ సినిమా సక్సెస్ఫుల్గా ప్రదర్శితమవుతోంది.ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం టాలీవుడ్ ఇండస్ట్రీకి మంచి గౌరవం తీసుకురావడంతో ఈ టీం కి తాజాగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

Advertisement

ఈ ఈవెంట్ కి టాలీవుడ్ కి చెందిన అన్ని విభాగాల ప్రతినిధులు, చిత్ర ప్రముఖులు హాజరయ్యారు.కానీ టాలీవుడ్ ప్రధాన విభాగాల్లో ఒకటైన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు( Manchu Vishnu ) రాలేదు.

మా తరపున వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి వేదిక పైకి వెళ్ళి ఆర్ఆర్ఆర్ టీమ్ కి అభినందనలు తెలిపారు.మంచు విష్ణు ఎందుకు రాలేదో ఆయన వేదికపై తెలియజేయారు.విదేశాల్లో ఉన్న విష్ణు హాజరుకాలేకపోయారు.

తన తరపున అభినందనలు చెప్పమన్నారంటూ మాదాల రవి ముగించారు.ప్రస్తుతం మంచు విష్ణు చేసిన పనికి అభిమానులు మండిపడడంతో పాటు దారుణంగా ట్రోలింగ్స్ చేస్తూ ఏకిపారేస్తున్నారు.

మా అధ్యక్షుడైన మంచు విష్ణు ఆర్ఆర్ఆర్ టీం కి అభినందనలు తెలపడానికి రాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కొంతమంది అయితే మంచు విష్ణు మా అధ్యక్షుడు అన్నమాట కానీ ఇంతవరకు మా స్టేషన్ కోసం చేసింది ఏమీ లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు