ఇంటికెళ్లి ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయంటూ ఎమోషనల్ అయిన మంచు విష్ణు

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో తెలుగు ప్రముఖ హీరో మంచు విష్ణు పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందిన సంగతి అందరికీ తెలిసిందే.దీంతో తాజాగా నటుడు మంచు విష్ణు ప్రెస్ మీట్ నిర్వహించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

 Maa New President Manchu Vishnu About Prakash Raj Resignation Details, Maa New P-TeluguStop.com

ఇందులో భాగంగా టాలీవుడ్ ప్రముఖ నటుడు మరియు సినీ నిర్మాత నాగబాబు మా ఎన్నికలలో ఓడిపోవడంతో రాజీనామా చేశాడు.దీంతో మంచు విష్ణు ఈ విషయంపై స్పందిస్తూ నాగబాబు తన కుటుంబ సభ్యులలో ఒకరని అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి అతడి సహాయం మరియు ఆలోచనలు చాలా అవసరమని కాబట్టి నాగబాబు రాజీనామాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించనని తెలిపాడు.

అంతేకాకుండా ఈ విషయం గురించి నాగబాబుతో వ్యక్తిగతంగా కలిసి మాట్లాడుతానని కూడా చెప్పుకొచ్చాడు.అలాగే సినీ నటులకు గెలుపు, ఓటమి, సంతోషం, దుఃఖం వంటివి చాలా కామన్ అని ఎందుకంటే ఒక్కోసారి తమ చిత్రాలు మంచి హిట్ అయితే ఆనందపడతామని అలా కాకుండా ఫ్లాప్ అయినప్పుడు కుమిలిపోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయని కాబట్టి తమకు గెలుపోటములు సహజమని చెప్పుకొచ్చాడు.

ఇక టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ రాజీనామా విషయంపై స్పందిస్తూ ప్రకాష్ రాజ్ అంటే తనకు చాలా ఇష్టమని అంతేకాకుండా ప్రకాష్ రాజ్ కి రాజకీయాల్లో చాలా అనుభవం ఉందని కాబట్టి అతడి రాజీనామా ని కూడా ఆమోదించనని చెప్పుకొచ్చాడు.

Telugu Maa, Maamanchu, Manchu Vishnu, Manchuvishnu, Prakash Raj, Tollywood-Movie

అయితే తను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఇండియన్ నేషనల్ బాస్కెట్ బాల్ టీమ్ కి కెప్టెన్ గా ఉండేవాడిని చెప్పుకొచ్చాడు.ఈ క్రమంలో కొన్నిసార్లు ఆటలో ఓడిపోయినప్పుడు ఇంటికి వచ్చి బోరున ఏడ్చేవాడినని అంతే కాకుండా ఒక్క్కోసారి అన్నం కూడా సహించేది కాదని కానీ ఇవన్నీ పట్టించుకుంటూ అక్కడే ఆగిపోతే జీవితం కూడా ఆగిపోతుందని జీవితంలో గెలుపు ఓటములు సహజమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.ఇక తొందర్లోనే తమ కార్యాచరణ గురించి పూర్తి వివరాలను తెలియజేస్తామని అలాగే ఎన్నికలలో వాగ్దానం చేసినట్లు ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరే విధంగా చూస్తానని తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube