ఆ ముగ్గురు 'మా' లో ఉన్నట్లా? లేనట్లా?

మా ఎన్నికలు పూర్తి అయ్యాయి.అయినా కూడా రచ్చ మాత్రం ఆగడం లేదు.

 Maa Membership Resignation-TeluguStop.com

పెద్ద ఎత్తున మా ఎన్నికల రచ్చ.ఎన్నికలు ఆ తర్వాత అంతా సైలెంట్ అవుతారని అంతా భావించారు.

కాని అనూహ్యంగా రాజీనామాలు మొదలు అయ్యాయి.నాగబాబు మరియు ప్రకాష్ రాజ్ లు మా సభ్యత్వం రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.

 Maa Membership Resignation-ఆ ముగ్గురు మా’ లో ఉన్నట్లా లేనట్లా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలాంటి సంకుచిత భావాలు ఉన్న నటీ నటుల మద్య నేను ఉండాలని అనుకోవడం లేదు అంటూ నాగబాబు తన మా సభ్యత్వం ను రాజీనామా చేస్తున్నట్లుగా పేర్కొన్నాడు.ఇక ప్రకాష్‌ రాజ్‌ కూడా తాను ఈ భాష వాడిని కాదు కనుక ఓడించారు.

అందుకే నేను మా సభ్యత్వం ను వదులుకుంటున్నాను అంటూ ప్రకటించాడు.వీరిద్దరితో పాటు అంతకు ముందు సీవీఎల్ కూడా తన మా సభ్యత్వంకు రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించాడు.

రాజీనామా లేఖను కూడా పంపించాడు.

ముగ్గురు కూడా తమ మా సభ్యత్వంను వదులుకుంటున్నట్లుగా పేర్కొన్నారు.

కాని ఇప్పటి వరకు వీరి సభ్యత్వాల విషయమై ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు.మా కొత్త అధ్యక్షుడు విష్ణు బాధ్యతలు తీసుకున్నాడు.

కనుక ఆయన ఈ రాజీనామాలపై స్పందించాల్సి ఉంది.రాత పూర్వంగా రాజీనామా లేఖ లు విష్ణు కు అందితే ఖచ్చితం గా రాజీనామా ఆమోదిస్తాడు.

కాని ఇప్పటి వరకు అలా అందాయా అంటే లేదు అనే సమాధానం వినిపిస్తుంది.మా సభ్యులు మాత్రమే కాకుండా మొన్నటి ఎన్నికల్లో ప్రకాష్‌ రాజ్ ప్యానల్‌ తరపున పోటీ చేసి గెలిచిన వారు కూడా తమ పదవుల కు రాజీనామా చేస్తామంటూ ప్రకటించారు.కనుక ఈ రాజీనామాల వ్యవహారం ఏంటో.ఎప్పటి కి ఈ విషయం తెములుతుందో అంటూ చాలా మంది జుట్టు పీక్కుంటున్నారు.

#Naga Babu #Prakash Raj #Manchu Vishnu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube