'మా'లో ముదిరిన మరో వివాదం.. ఈసారి ఏం జరుగుతోందో ఏమో?

Maa In Another Controversy What Happening This Time

గత కొద్ది రోజుల క్రితం వరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఎన్నో గొడవలు పోట్లాటలు జరిగిన సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ ఎన్నికలు ముగిసిన అనంతరం కొన్ని రోజుల పాటు మా చర్చలు పెద్ద ఎత్తున జరిగాయి.

 Maa In Another Controversy What Happening This Time-TeluguStop.com

ఇక చివరికి ఈ వివాదం ముగియడంతో ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు.ఇదిలా ఉండగా తాజాగా మరోసారి మాలో వివాదం చెలరేగుతోందని తెలుస్తోంది.

మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎంపిక అయిన తర్వాత మా ఆఫీసులు గత కొద్దిరోజుల నుంచి మూతబడి ఉన్నాయి.

 Maa In Another Controversy What Happening This Time-మా’లో ముదిరిన మరో వివాదం.. ఈసారి ఏం జరుగుతోందో ఏమో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎన్నికలు జరిగి కొత్త కార్యవర్గం అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటి పోయినప్పటికీ ఇప్పటివరకు అసోసియేషన్ ఆఫీసుకు తాళాలు వేసి ఉండడం చేత మరోసారి వివాదం చెలరేగనుందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే కొందరు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మా అసోసియేషన్ ఆఫీసుకు ఎప్పుడు వెళ్ళిన తాళాలు వేసి ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.

పెన్షన్ డబ్బులతో పాటు మరి కొన్ని సమస్యలను వెల్లడించాలని అసోసియేషన్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఇక్కడ మాత్రం ఆఫీస్ తాళాలు వేసి ఉండడంతో పలువురు ఈ విషయం గురించి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.

Telugu Artist Problems, Controversy, Lock Maa, Artistes, Prakash Raj, Tollywood-Movie

మా అసోసియేషన్ గురించి ఈ విధంగా వార్తలు వస్తున్నప్పటికీ మా అధ్యక్షుడు సినిమాలతో బిజీగా ఉన్నారు.ఇదే విషయాన్ని కనుక ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు సీరియస్ గా తీసుకుంటే ఈ వివాదం మరోసారి ముదురేలా కనిపిస్తుంది.మరి ఈ విషయంపై మా అధ్యక్షుడు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

#Lock Maa #Controversy #Artistes #Artist Problems #Prakash Raj

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube