తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల హడావుడి గత నెల నుండే మొదలు అయ్యింది.ప్రకాష్ రాజ్ మంచు విష్ణు లు ఒక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడబోతున్న ప్రథాన పార్టీల అభ్యర్థుల మాదిరిగా అప్పుడే మీడియా సమావేశాలు మొదలు పెట్టారు.
ఇటీవల కాస్త సైలెంట్ అయినా కూడా మళ్లీ ఈ విషయమై పెద్ద ఎత్తున రచ్చ మొదలు కాబోతుంది.ఆగస్టులో ఎన్నికలకు సంబంధించిన ప్రకటన రాబోతుందట.
సెప్టెంబర్ లో ప్రస్తుత కార్యవర్గం పదవి కాలం ముగుస్తుంది.కనుక వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.
అందుకు గాను ఏర్పాట్లు చేసేందుకు ఆగస్టులో అంతా సిద్దం అవుతుంది.అప్పుడు మొదలు అయ్యే సందడి రెండు నెలల పాటు రచ్చ రచ్చగా ఉంటుందని అంటున్నారు.
మంచు విష్ణు సినిమా పెద్దలకు సవాలు విసిరాడు.దమ్ముంటే మీరు ఏకగ్రీవంకు ముందుకు రండి ఎవరిని ఏకగ్రీవం చేసినా కూడా నేను మద్దతుగా నిలుస్తాను అంటూ ప్రకటించాడు.
ఇక మా ఎన్నికల ప్రధాన అంశం అయిన భవనం గురించి కూడా విష్ణు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు.నేను మా ఎన్నికలతో సంబంధం లేకుండా నూరు శాతం నిధులు ఇచ్చి భవనం కట్టేందుకు సిద్దం అంటూ ప్రకటించాడు.
తనకు మద్దతుగా నిలిచే వారికి ఖచ్చితంగా తోడు ఉంటాను అంటూ హామీ ఇచ్చాడు.ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం కూడా సినిమాలపై కాకుండా ఎన్నికల పై ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.
సినిమాల్లో నటుడిగా బిజీగా ఉన్న వారు కూడా వచ్చే నెల నుండి మా ఎన్నికల హడావుడి మొదలు పెడతారు అంటున్నారు.

బాలకృష్ణ మా అధ్యక్షుడు అయితే తనకు ఓకే అన్నట్లుగా మంచు విష్ణు ప్రకటించాడు.మరి బాలయ్య ను అధ్యక్షుడిగా చేసేందుకు ఇతర సభ్యులు ఓకే చెప్తారా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి వచ్చే నెలలో జరుగబోతున్న సందడి గురించి అంతా కూడా ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.