ప్రకాష్‌ రాజ్ ప్యానల్‌ బలంగా ఉంది.. గెలుపు గుర్రం ఎక్కేనా?

గతంలో మాదిరిగానే ఈసారి కూడా మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి.ఒక మాట చెప్పాలంటే ఈసారి ఇంకాస్త ఎక్కువ ఇంట్రెస్ట్‌ ను కలుగ జేస్తున్నాయి.

 Maa Elections Prakhash Raj Panel Looking Strong-TeluguStop.com

మొదట పర భాష నటుడు అయిన ప్రకాష్ రాజ్ తాను మా ఎన్నికల బరిలో నిలవాలనుకుంటున్నట్లుగా చెప్పాడు.పర భాష నటుడు అయినా కూడా ఆయనకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

అద్బుతమైన ఫాలోయింగ్‌ ఉండటంతో పాటు ఆయనకు ఇండస్ట్రీ వర్గాల్లో మంచి పేరు కూడా ఉంది.అందుకే ఆయన గెలుస్తాడని అంతా భావించారు.

 Maa Elections Prakhash Raj Panel Looking Strong-ప్రకాష్‌ రాజ్ ప్యానల్‌ బలంగా ఉంది.. గెలుపు గుర్రం ఎక్కేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని అనూహ్యంగా ప్రకాష్ రాజ్ కు పోటీగా తాను నిలుస్తానంటూ మంచు విష్ణు ప్రకటించాడు.ఆ తర్వాత జీవిత రాజశేఖర్‌.

ఆ తర్వాత హేమలు కూడా రంగంలోకి దిగబోతున్నట్లుగా చెప్పారు.ఇంత మంది పోటీ పడుతున్న మా ఎన్నికల్లో ప్రకాష్‌ రాజ్ ప్యానల్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ఆయన ప్యానల్ బలంగా ఉండటం వల్ల ఖచ్చితంగా గెలుపు సాధిస్తుందనే నమ్మకం ను కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.

అధ్యక్షుడిగా ప్రకాష్‌ రాజ్ పోటీ చేస్తుండగా ఆయన ప్యానల్‌ లో ఇంకా జయసుధ, శ్రీకాంత్‌, బెనర్జీ, సాయి కుమార్, తనీష్‌, ప్రగతి, అనసూయ, సన, అనిత చౌదరి, సుధ, అజయ్‌, నాగినీడు, బ్రహ్మాజీ, రవి ప్రకాష్ ఇంకా ముఖ్యులు ఉన్నారు.

వీరికి ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది.అలాగే ప్రేక్షకుల్లో కూడా అభిమానం ఉంది.కనుక ఈ ప్యానెల్‌ గెలవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.

Telugu Film News, Maa Elections, News In Telugu, Prakash Raj, Telugu Film News In Telugu-Movie

మరి ప్రకాష్‌ రాజ్‌ ప్యానల్‌ కు ఉన్న ఒక్క మైనస్‌ స్థానికేతరుడు.ఆ ఒక్క మైనస్ ను అధిగమించి గెలుపు సాధిస్తాడా అనేది చూడాలి. ప్రకాష్ రాజ్‌ ప్యానల్‌ కు పోటీ గా అవతల కూడా గట్టి పోటీ అయితే నిలబడే అవకాశం ఉంది.

ఎన్నికల సమయంలో ప్రచారం పై గెలుపు ఆధారపడి ఉంటుంది.

#Prakash Raj #MAA

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు