రాజీనామాలపై అప్పుడు ఆలోచిస్తా.. మా అధ్యక్షుడు విష్ణు షాకింగ్ కామెంట్స్?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన మంచు విష్ణు ప్రమాణ స్వీకారం అనంతరం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు.తన ప్యానెల్ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం వీఐపీ దర్శనం ద్వారా తన తండ్రి మోహన్ బాబు మంచు లక్ష్మి తో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు.

 Maa Elections 2021 Manchu Vishnu Visit Tirumala Tirupati His Team-TeluguStop.com

ఈ క్రమంలోనే ఆలయ ప్రధాన అర్చకులు మోహన్ బాబు మంచు విష్ణు ప్యానెల్ సభ్యులకు సాదరంగా ఆహ్వానించి వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఇక స్వామివారి దర్శనం అనంతరం మీడియాతో మోహన్ బాబు మాట్లాడారు.

 Maa Elections 2021 Manchu Vishnu Visit Tirumala Tirupati His Team-రాజీనామాలపై అప్పుడు ఆలోచిస్తా.. మా అధ్యక్షుడు విష్ణు షాకింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

విష్ణు మా అధ్యక్షుడిగా గెలవడం ఎంతో ఆనందంగా ఉంది.మా అధ్యక్ష పదవి చేపట్టడం సర్వసాధారణమైన విషయం కాదు.

ఈ పదవి వెనుక ఎన్నో బాధ్యతలు ఉన్నాయని మోహన్ బాబు తెలియజేశారు.తర్వాత మా అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడుతూ మా అధ్యక్ష పదవి గెలుపొందడం వెనుక అందరి కృషి ఉందని వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇకపోతే ప్యానెల్ సభ్యులు రాజీనామాలు గురించి విష్ణు మాట్లాడుతూ వారు రాజీనామా చేస్తారనే విషయం ఇప్పటివరకు మీడియా ద్వారా మాత్రమే తెలిసిందని, తన వరకు ఏ విధమైనటువంటి రాజీనామా లేఖలు రాలేదని, ఒకవేళ వచ్చినప్పుడు ఈ రాజీనామాల గురించి ఆలోచిస్తానని ఈ సందర్భంగా మా అధ్యక్షుడు విష్ణు తెలియజేశారు.

#Maa #Mohan Babu #Manchu Vishnu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube