'మా' ఎన్నికలు ముగిసింది.. పవన్ కు మోహన్ బాబు కౌంటర్ ఇస్తాడా?

తెలుగు సిని ఇండస్ట్రీలో నిన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు బాగా రసవత్తరంగా జరిగింది.ఎన్నడూ లేని విధంగా నిన్న ఎన్నికలు బాగా మాటల యుద్ధం, విమర్శల యుద్ధంతో ముగిసింది.

 Maa Elections Over Will Mohan Babu Couters To Pawan Kalyan Details,  Maa Electio-TeluguStop.com

చాలా వరకు తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన అందరూ ఎన్నికలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.మొత్తానికి ఈ ఎన్నికలకు పోటీగా మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ నిల్చోగా.

మంచు విష్ణు గెలుపొందాడు.ఇదిలా ఉంటే మొత్తానికి ఎన్నికల ముగియడంతో ఇందులో పవన్ కళ్యాణ్ కు మోహన్ బాబు కౌంటర్ ఇస్తాడా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

అదేంటి మోహన్ బాబు పవన్ కు కౌంటర్ ఇవ్వడం ఏంటి అని అనుకుంటున్నారా.ఇటీవలే రిపబ్లిక్ సినిమా విడుదలకు ముందు పవన్ కళ్యాణ్ సినిమా టిక్కెట్ల రేట్ల గురించి వేదికపై ఎంతలా వ్యాఖ్యలు చేసాడో చూశాం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రులపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు.అంతే కాకుండా మోహన్ బాబును ఉద్దేశించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు.అలా పవన్ వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి, మంత్రులపై బాగా కౌంటర్ ఇవ్వడంతో ఆంధ్ర ప్రదేశ్ మంత్రులు పవన్ పై బాగా విమర్శలు చేశారు.

ఇక పోసాని కృష్ణమురళి కూడా మీడియా ముందుకు వచ్చి ఓ రేంజ్ లో పవన్ పై విమర్శల వ్యాఖ్యలు చేశాడు.

దీంతో పవన్ విమర్శించిన వారందరూ పవన్ పై వ్యాఖ్యలు చేయగా మోహన్ బాబు ఒక్కడే ఏమీ వ్యాఖ్యలు చేయలేకపోయాడు.ఆ రోజు పవన్ వేదికపై మోహన్ బాబు పేరు ప్రస్తావిస్తూ.

ఇప్పుడు కలిసి రాకపోతే రేపటి నాడు నీ విద్యాసంస్థల విషయంలో కూడా ప్రభుత్వం ఇలాగే చేస్తుందని అన్నాడు.

Telugu Ap Cm Jagan, Maa, Manchu Manoj, Mohan Babu, Mohanbabu, Pawan Kalyan, Toll

ఆ సమయంలో మోహన్ బాబు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేడు.కేవలం ఎన్నికల తర్వాత పవన్ కు వివరంగా సమాధానం ఇస్తానని అన్నాడు మోహన్ బాబు.దీంతో ప్రస్తుతం ఎన్నికల పూర్తవడంతో మోహన్ బాబు పవన్ కళ్యాణ్ పై ఎటువంటి వ్యాఖ్యలు చేస్తాడా అని బాగా హాట్ టాపిక్ గా మారింది.

తన కొడుకు మంచు విష్ణు ఎన్నికల్లో గెలవడం తో మోహన్ బాబుకు మరింత క్రేజ్ దక్కడంతో వైసీపీ నేతలు తెగ సంతోష పడుతున్నారు.

Telugu Ap Cm Jagan, Maa, Manchu Manoj, Mohan Babu, Mohanbabu, Pawan Kalyan, Toll

ఇక ఈ సమయంలో మోహన్ బాబు పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ఇస్తే చూడాలని ఎదురుచూస్తున్నారు వైసీపీ నేతలు.ఒకవేళ మోహన్ బాబు కౌంటర్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను పొగుడుతూ పవన్ కి కౌంటర్ ఇయ్యాలని అనుకుంటున్నారు వైసీపీ నేతలు.ఇదిలా ఉంటే నిన్న ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ ఓటు వేసిన తర్వాత కాసేపు మోహన్ బాబుతో మాట్లాడారు.

Telugu Ap Cm Jagan, Maa, Manchu Manoj, Mohan Babu, Mohanbabu, Pawan Kalyan, Toll

వాళ్ళిద్దరు మాత్రమే పక్కకు వెళ్లగా అక్కడ మంచు మనోజ్ కూడా ఉన్నాడు.దీంతో వాళ్ళు ఏం చర్చించుకున్నారో ఎవరికి అర్ధం కాలేకపోగా.కొందరు ఆ రోజు పవన్ మాట్లాడిన మాటల గురించి ఏవైనా డిస్కస్ చేశారేమో అని అనుకుంటున్నారు.దీంతో గొడవ సద్దుమణిగిందా లేదా తెలియదు కానీ.వైసీపీ నేతలు మాత్రం పవన్ కళ్యాణ్ కు మోహన్ బాబు కౌంటర్ ఇస్తారా ఇవ్వరా అని కాస్త ఆలోచనలో పడినట్లు తెలిసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube