నేడు మా ఎన్నికలు! ఓటు హక్కు వినియోగించుకోనున్న 800 మంది!  

మొదలైన మా ఎన్నికలు. హోరాహరీ పోరులో గెలుపు కోసం నరేష్, శివాజీ రాజా పోటీ. .

Maa Association Elections-megastar,naresh,srikanth,tollywood

ఓ వైపు రెండు తెలుగు రాష్ట్రాలలో సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకుంటే మరో వైపు మా అసోసియేషన్ ఎన్నికలకి ఈ రోజు వేదిక కానుంది. తాజాగా మా అసోషియేషన్ లో ఎన్నికలు మొదలయ్యాయి. శివాజీరాజా, నరేష్ రెండు వర్గాలుగా పోటీ పడుతున్నారు..

నేడు మా ఎన్నికలు! ఓటు హక్కు వినియోగించుకోనున్న 800 మంది!-MAA Association Elections

రెండు వర్గాల మధ్య పోటాపోటీ వాతావరణం వుంది. అయితే మెగా హీరో నాగబాబు నరేష్ ప్యానల్ కి సపోర్ట్ చేయడం ద్వారా మెగాస్టార్ మద్దతు కూడా ఆ ప్యానల్ కే వుంటుంది అని అందరూ భావిస్తున్నారు. టాలీవుడ్ మా ఎన్నికలలో మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నవారే ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్నారు.

ఇదిలా వుంటే మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలలో రెండు వర్గాలు పోటీ పడుతూ వుంటే మధ్యలో నటి హేమ ఇండిపెండెంట్ గా వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతుంది. మాలో మొత్తం 800 సభ్యులు వున్నట్లు తెలుస్తుంది. మరి వీరిలో ఎంత మంది తమ ఓటు హక్కుని వినియోగించుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు ఓటింగ్ జరుగుతుందని తెలుస్తుంది.