ప్రముఖ ఎన్నారై “యూసఫ్ ఆలీ” కు మరో అరుదైన గౌరవం...ఈ సారి..

యూసఫ్ ఆలీ ఈ పేరు తెలియని ప్రవాసులు ఉండరంటే అతిశయోక్తి కాదు.దుబాయ్ కంట్రీస్ లో యూసఫ్ ఆలీ కు ఎంతో గుర్తింపు ఉంది.

 Ma Yusuff Ali Get Oman Long Term Visa, Ma Yusuff Ali, Long Term Residency Visa,-TeluguStop.com

అత్యంత సామాన్యుడిలా మొదలైన తన జీవితం నేడు కొన్ని కోట్ల రూపాయలకు చేరుకుంది.ఆయనే లులు గ్రూప్స్ అధినేత ప్రముఖ ఎన్నారై యూసఫ్ ఆలీ.

కేరళా రాష్ట్రానికి చెందిన యూసఫ్ అలీ ఎన్నో ఏళ్ళ క్రితమే ఒమన్ వెళ్ళిపోయారు.అక్కడే ఉంటూ మెల్ల మెల్లగా వ్యాపారాలు ప్రారంభించిన అలీ అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు.

ఒమన్ లో ఉంటూ ఒమన్ ఆర్ధికాభివృద్ధి లో కీలక పాత్ర పోషించిన యూసఫ్ ఆలీ కి అక్కడి ప్రభుత్వం ఎన్నో సందర్భాలలో సత్కరించుకుంది.2021 ఏడాదిలో అబుదాబి సివిలియన్ అవార్డ్ తో గౌరవించుకున్న ప్రభుత్వం ఇదే ఏడాది 10 ఏళ్ళ పాటు అర్హత ఉండే గోల్డెన్ వీసాను అందించి గౌరవించుకుంది.అలాగే అక్కడి ఆర్ధిక ప్రణాళిక రంగంలో కీలక సభ్యత్వం ఇచ్చింది.ఒమన్ లో భారీగా పెట్టుబడులు పెట్టడంతో పాటు, ఎంతో మందికి ఉపాది అవకాశాలు కల్పించింది.అలాగే కష్టాలలో ఉన్న స్థానిక ప్రజలకు , ఎన్నారై లు ఎంతోమందికి ఆర్ధిక సాయం యూసఫ్ అలీ అందించడంతో ఆయనకు పలు సేవా అవార్డులు కూడా దక్కాయి.ఈ క్రమంలోనే

యూసఫ్ ఆలీ ఒమన్ లో అందించిన సేవలకు గాను ప్రభుత్వం తాజాగా లాంగ్ టర్మ్ రెసిడెన్సీ వీసాను అందించి సత్కరించింది.

దాదాపు 21 మంది పారిశ్రామక వేత్తలకు ఈ అరుదైన గౌరవాన్నిఅందించింది.ఈ గౌరవాన్ని వారికి అందించడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా పెట్టుబడుల విషయంలో మరింత మెరుగైన పటిష్టమైన వ్యవస్థ ఏర్పడే అవకాశం ఉంటుందని తెలిపింది.

GDP పెరుగుదల అభివృద్దికి దోహదపడుతుందని తెలిపారు.ఇదిలాఉంటే ఈ గౌరవాన్ని అందించిన ఒమన్ ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు యూసఫ్ అలీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube