ప్రతిపక్ష నేతపై దాడి చేస్తే పర్లేదు కానీ..తనిఖీ చేస్తే అవమానమా  

M.p. Vijay Sai Reddy Give Rivers Punch To Tdp Leaders-

ఏపీ లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ,టీడీపీ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.అయితే ఇప్పుడు చోటుచేసుకున్న తాజా ఉదంతం తో మరోసారి నేతల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి.

M.p. Vijay Sai Reddy Give Rivers Punch To Tdp Leaders--M.P. Vijay Sai Reddy Give Rivers Punch To TDP Leaders-

గన్నవరం నుంచి హైదరాబాద్ వెళుతున్న సమయంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి ని సిబ్బంది తనిఖీ చేసి పంపిన సంగతి తెలిసిందే.అయితే దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.ఈ క్రమంలో వైసీపీ నేత, ఆపార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు.

M.p. Vijay Sai Reddy Give Rivers Punch To Tdp Leaders--M.P. Vijay Sai Reddy Give Rivers Punch To TDP Leaders-

వీఐపీ, జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న మాజీ సీఎం చంద్రబాబుకు ప్రత్యేక వాహనం కూడా కేటాయించలేదని అధికారుల తీరుపై తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేతగా ఉండగా జగన్ పై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఏకంగా హత్యాయత్నం జరిగింది అప్పుడు ఏమాత్రం స్పందించని వారు ఇప్పుడు ఎందుకు ఇలా స్పందిస్తున్నారు అంటూ కౌంటర్ ఇచ్చారు.

అలానే ఆ సంఘటన జరిగినప్పుడు ఏమాత్రం పట్టించుకోని పచ్చ మీడియా ఇప్పుడు చంద్రబాబుకి ఏదో జరిగినట్లు శోకాలు పెడుతున్నారని ఆయన విమర్శించారు.

ఆయన కాన్వాయ్‌కి ట్రాఫిక్ ను ఆపడం లేదని ఎయిర్ పోర్టులో తనిఖీలు చేస్తే అవమానించినట్లు ఫీల్ అవుతున్నారని సాయి రెడ్డి మండిపడ్డారు.