కాపీ కొట్టి ట్రెండ్ సెట్ చేశాడు.. క‌ల‌క‌లం రేపుతున్న‌ కోటి వ్యాఖ్య‌లు..!  

కీబోర్డ్ ప్లేయ‌ర్‌గా త‌న కెరీర్‌ను ప్రారంభించిన ఏ ఆర్ రెహ‌మాన్, అంచెలంచెలుగా ఎదిగి, రెండు సార్లు ఆస్కార్ అవార్డుల‌తో పాటు, నాలుగు జాతీయ అవార్డులు, అలాగే రెండు గ్రామీ పుర‌స్కారాల‌తో పాటు, ప‌లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సొంతం చేసుకుని అంత‌ర్జాతీయ స్థాయిలో గ్రేట్ మ్యూజిక్ కంపోజ‌ర్‌గా స‌త్తా చాటుతున్నారు.మొద‌ట రెహ‌మాన్‌కు బ్రేక్ ఇచ్చిన చిత్రం మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన రోజా.

TeluguStop.com - Director Koti Comments On Arrehman

ఆ చిత్రంలో రెహ‌మాన్ కంపోజ్ చేసిన పాటలు, స‌రికొత్త ట్రెండ్ సెట్ చేశాయి.

ఇక అప్ప‌టి నుండి వెనుదిరిగి చూడ‌ని రెహ‌మాన్, త‌నదైన‌ సంగీతంతో ఎప్ప‌టిక‌ప్పుడు శ్రోత‌ల‌ను అల‌రిస్తూ ముందుగుసాగుతున్నారు.

TeluguStop.com - కాపీ కొట్టి ట్రెండ్ సెట్ చేశాడు.. క‌ల‌క‌లం రేపుతున్న‌ కోటి వ్యాఖ్య‌లు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే తాజాగా రెహ‌మాన్ పై టాలీవుడ్ సీనియ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కోటి చేసిన వ్యాఖ్య‌లు సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.రెహ‌మాన్ ఈ స్థాయికి రావ‌డానికి కార‌ణం తామే అన్న కోటి, త‌న ద‌గ్గ‌ర శిష్యుడిగా ప‌ని చేసిన రెహ‌మాన్, మెళ‌కువ‌లు నేర్చుకున్నాడ‌ని తెలిపారు.

రెహ‌మాన్ సంగీతంలో ఉంగే స్టైల్ మాదే అని, మేము క్రియేట్ చేసిన ట్యూన్స్‌ని కాపీ కొట్టి, కొన్ని మార్పులు చేసిన పేరు తెచ్చుకున్నాడ‌ని కోటి అన్నారు.ఓ మ్యుజిక్ డైరెక్ట‌ర్‌గా రెహ‌మాన్ సెట్ చేసిన ట్రెండ్ మాదే అని, మేము చేసిన ఓ ఆల్బ‌మ్‌ను కాపీ కొట్టి, రెహ‌మాన్ అనేక పాట‌లు కంపోజ్ చేశాడ‌ని కోటి ఆరోపించారు.అత‌డ క‌ష్ట‌ప‌డిన మాట వాస్త‌వ‌మే కానీ, అత‌డు సృష్టించిన ట్రెండ్‌కు మాత్రం అస‌లు హ‌క్కుదారులం త‌మే అని కోటి వ్యాఖ్య‌లు చేశారు.

మ‌రి రెహ‌మాన్ స్థాయిలో మీకు గుర్తింపు ఎందుకు రాలేద‌ని ప్ర‌శ్నించ‌గా, టాలీవుడ్‌లో గ్రూపిజం ఎక్కువ‌ని, త‌న అవాకాశాలు వేరే వాళ్ళు ఎత్తుకుపోయార‌ని చెప్ప‌డం విశేషం.

ఏది ఏమైనా ఆస్కార్ విన్న‌ర్ రెహ‌మాన్ పై కోటి చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా ఉన్నాయి.దీంతో ఇప్ప‌టికే సోష‌ల్ మీడియ‌లో రెహ‌మాన్ ఫ్యాన్స్ కోటిని ట్రోల్ చేస్తున్నారు.

మ‌రి గురువు కోటి వ్యాఖ్య‌ల పై శిష్యుడు రెహ‌మాన్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి.

.

#OscarAward #AR Rehaman #Director Koti #IndianGreat

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు