లివర్ పాడైన సమయంలో నా కొడుకు అలా చేశాడు.. సుద్దాల కీలక వ్యాఖ్యలు!

Lyricist Suddala Ashok Teja Comments About Lever Problem

కథా రచయిత, పాటల రచయితగా సుద్దాల అశోక్ తేజ పేరు, గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.సుద్దాల అశోక్ తేజ తన సినీ కెరీర్ లో 2200కు పైగా పాటలను రాయడం గమనార్హం.

 Lyricist Suddala Ashok Teja Comments About Lever Problem-TeluguStop.com

ఠాగూర్ సినిమాలోని నేను సైతం పాటకు సుద్దాల అశోక్ తేజకు ఉత్తమ పాటల రచయితగా పురస్కారం దక్కింది.బాల్యం నుంచే సుద్దాల అశోక్ తేజ పాటలు రాయడం నేర్చుకున్నారు.

సినిమా ఇండస్ట్రీకి రాకముందు సుద్దాల అశోక్ తేజ తెలుగు టీచర్ గా పని చేశారు.

 Lyricist Suddala Ashok Teja Comments About Lever Problem-లివర్ పాడైన సమయంలో నా కొడుకు అలా చేశాడు.. సుద్దాల కీలక వ్యాఖ్యలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నమస్తే అన్న సినిమాతో సుద్దాల అశోక్ తేజ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

ప్రముఖ సినీ నటుడు అయిన ఉత్తేజ్ కు సుద్దాల అశోక్ తేజ మేనమామ కావడం గమనార్హం.కెరీర్ తొలినాళ్లలో విప్లవ గీతాలను ఎక్కువగా రాసిన సుద్దాల అశోక్ తేజ తర్వాత కాలంలో అన్ని పాటలను రాశారు.

నిన్నే పెళ్లాడతా, ఒసేయ్ రాములమ్మా సినిమాలు పాటల రచయితగా సుద్దాల అశోక్ తేజకు మంచి పేరును తెచ్చిపెట్టాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ తనకు ముగ్గురు పిల్లలని తెలిపారు.

నాకు చాలాకాలం నుంచి షుగర్ ఉందని షుగర్ వల్ల లివర్ సంబంధిత సమస్య వచ్చిందని తేలడంతో లివర్ ట్రాన్స్ ప్లాంట్ కు వెళ్లానని సుద్దాల అశోక్ తేజ చెప్పుకొచ్చారు.ముగ్గురు పిల్లలు లివర్ ను డొనేట్ చేస్తామని చెప్పారని చిన్నబాబు తనకు లివర్ డొనేట్ చేశాడని డాక్టర్లు కూడా మీ పిల్లల లివర్ మీకు బెటర్ అని చెప్పారని సుద్దాల అశోక్ తేజ చెప్పుకొచ్చారు.

Telugu Lyricist, Ninne Pelladata, Osey Ramulamma-Movie

తనకు డ్రింక్ అలావాటు ఉంది కానీ తాను ఎక్కువగా తాగనని సుద్దాల అశోక్ తేజ వెల్లడించారు.లివర్ చెడిపోయే స్థాయిలో డ్రింకింగ్ హ్యాబిట్ తనకు లేదని సుద్దాల అశోక్ తేజ అన్నారు.వేర్వేరు సమస్యల వల్ల అల్కహాల్ తీసుకోని వాళ్లకు సైతం లివర్ పాడవుతుందని ఆ తర్వాత తెలిసిందని సుద్దాల అశోక్ తేజ చెప్పుకొచ్చారు.

#Ninne Pelladata #Lyricist #Osey Ramulamma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube