నీకు అవకాశం ఇస్తే నాకేంటని ఆ డైరెక్టర్ చాలా నీచంగా....

తెలుగులో ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన “పెళ్లి చూపులు” అనే చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత మంచి హిట్ అయిందో ప్రేక్షకులకు తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ చిత్రం పాటల పరంగా కూడా మంచి హిట్ టాక్ ని అందుకుంది.

 Lyricist Shreshta React About Her Struggles In Film Industry, Shrestha, Tollywo-TeluguStop.com

కాగా ఈ చిత్రంలో చినుకు తాకే, మెరిసే మెరిసే, తదితర పాటలను రాసినటువంటి టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత శ్రేష్ట తాజాగా ఓ ప్రముఖ వార్తా ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తాను సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఎదుర్కొన్న సంఘటనల గురించి ప్రేక్షకులకులతో పంచుకుంది.

ఇందులో భాగంగా తాను సినిమా పరిశ్రమకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం చాలా కష్టపడ్డానని ఈ క్రమంలో రోజు ఏదో ఒక సినిమా ఆఫీస్ చుట్టూ తిరిగేదాన్నని చెప్పుకొచ్చింది.

కానీ  కొందరు తనలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించకుండా అవకాశాల పేరుతో లొంగదీసుకునే ప్రయత్నాలు చేశారని సంచలన వ్యాఖ్యలు చేసింది.అంతేకాక ఓ డైరెక్టర్ ఏకంగా నీకు అవకాశం ఇస్తే నాకేంటని అడిగాడని దాంతో మొదట్లో తనకు అర్థం కాలేదని కానీ మెల్ల మెల్లగా విషయం అర్థం అవడంతో అక్కడినుంచి వెళ్లిపోయానని చెప్పుకొచ్చింది.

తనని కమిట్మెంట్ అడిగిన ఆ డైరెక్టర్ పేరు చెప్పడానికి శ్రేష్ట ఇష్టపడ లేదు.కానీ అతడు అప్పటికే ఓ నంది అవార్డును అందుకున్నాడని హింట్ ఇచ్చింది.సినిమా పరిశ్రమలో చాలా మంది అవకాశం కోసం వచ్చేటువంటి  నూతన నటీనటులు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

అలాగే తాను 2012వ సంవత్సరంలో విడుదలైన “ఒక రొమాంటిక్ క్రైమ్ కథ” అనే చిత్రం ద్వారా పాటల రచయితగా సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యానని తెలిపింది.

కానీ కమిట్ మెంట్లు ఇవ్వలేక ఈ చిత్రం కంటే ముందుగా దాదాపుగా పదికి పైగా చిత్రాలలో పాటలు రాసే అవకాశాన్ని కోల్పోయానని కూడా తెలిపింది.ఇప్పటివరకు తాను దాదాపుగా గా పదికి పైగా చిత్రాలలో 18 కి పైగా పాటలను రచించానని కూడా చెప్పుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube