వెజ్ ఆర్డర్ చేస్తే నాన్ వెజ్ పంపారు.. సెంటిమెంట్స్ దెబ్బ తిశారంటూ రచయిత ఫైర్!

కోలీవుడ్ పాటల రచయిత ఆయన కో శేషాకు తాజాగా ఒక చేదు అనుభవం ఎదురయ్యింది.దీనితో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ పై తీవస్తాయిలో మండిపడ్డారు.

 Lyricist Ko Sesha Alleges Swiggy Order Veg Meal Contains Meat Pieces , Swiggy O-TeluguStop.com

ప్యూర్ వెజిటేరియన్ అయిన కో శేషా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ వాళ్లు చేసిన చిన్న పొరపాటు వల్ల ఏకంగా మాంసం నీ రుచి చూసారు.అసలేంజరిగిందంటే.

తాజాగా శేషా బెంగళూరులో స్టే చేశాడు.ఈ నేపథ్యంలోనే ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ ద్వారా గోబీ మంచూరియా విత్‌ కార్న్‌ ఫ్రైడ్‌ రైస్‌ ఆర్డర్‌ చేశాడు.

అయితే అప్పటికే మంచి ఆకలి మీద ఉన్న అతను ఫుడ్ రావడంతో వెంటనే గబగబా తినేసాడు.అయితే ఆ ఫుడ్ కొంచెం తిన్న తర్వాత ఎందుకో ఆయనకు ఫుడ్ తేడాగా అనిపించింది.

వెంటనే తినడం ఆపేసి తనతో పాటు ఉన్న ఇద్దరు నాన్ వెజిటేరియన్ స్నేహితులకు దానిని రుచి చూపించాడు.అది తిన్న వాళ్ళు వెంటనే చికెన్ మంచూరియా అని క్లారిటీ ఇవ్వడంతో కో శేషా వెంటనే స్విగ్గి కస్టమర్ కేర్ ను సంప్రదించాడు.

అయితే వారి పొరపాటున గుర్తించిన సదరు సంస్థ ఆర్డర్ విలువ 70 రూపాయలను చేస్తామని బదులు ఇవ్వగా కోపంతో రగిలిపోయిన కో శేషా తమ మత విశ్వాసాలను 70 రూపాయలకు విలువ కడతారా అంటూ వారిపై విమర్శలు గుర్తించాడు.అంతేకాకుండా ట్విట్టర్ వేదికగా చెత్త సర్వీస్‌ అంటూ తీవ్ర స్థాయిలో మళ్లీ పడ్డాడు.

అయితే ప్యూర్ వెజిటేరియన్‌ అయిన తనకు స్విగ్గీ స్టేట్‌ హెడ్‌ క్షమాణలు చెప్పాలని,లేకపోతే అవసరమనుకుంటే డెలివరీ యాప్‌ పై లీగల్‌ గా కూడా వెళ్తానని శేషా చెప్పుకొచ్చాడు.అయితే శేషా ట్వీట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది.కొందరు ఆన్‌లైన్‌ ఫుల్‌ డెలివరీల్లో ఇవన్నీ కామన్‌ అని కామెంట్స్ చేయగా ఇంకొందరు స్విగ్గీ సర్వీస్‌ ప్రస్తుతం మునుపటిలా లేదని అంటున్నారు.ఇంకొందరు.ఇదివరకు ఎప్పుడూ మాంసం తిననపుడు అది వెజ్‌ కాదు.నాన్‌ వెజ్‌ అని ఎలా తెలిసింది? అని శేషాను ప్రశ్నిస్తున్నారు.ఇక ఈ వివాదంపై స్విగ్గీ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ రెస్టారెంట్‌ పార్టనర్‌ వల్లే తమ కస్టమర్‌కు ఇబ్బంది కలిగిందని, తమ సర్వీస్‌లో లోపం కాదని చెప్పింది.నిజంగా పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుని.

శేషాకు వివరణ ఇస్తామని బదులిచ్చింది స్విగ్గి సంస్థ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube