సింగర్ సునీత పై చంద్ర బోస్ సంచలన వ్యాఖ్యలు..అతనే ఒప్పించాడట.!

ఇప్పుడు యూ ట్యూబ్ లో ట్రేండింగ్ పాట ఏదన్నా ఉంది అంటే అది నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా అనే పాట అనడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి.ఈ పాటికి ఎంతమంది వీరాభిమానులు ఉన్నారో మాటల్లో చెప్పలేము.

 Lyric Writer Chandrbose Sensational Comments On Singer Sunitha, , Chandra Bose,-TeluguStop.com

ఈ పాటను రాసింది ఎవరో ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు.ఈ పాటను రాసింది ప్రముఖ లిరిక్ రైటర్ చంద్రబోస్ గారు.

ఆయన కలం నుంచి వచ్చిన ప్రతి మాట ఒక పాటలాగా అందరి మదిలో నిలిచిపోతుంది.అలా ఆయన ఎంతో అద్భుతమైన లిరిక్స్ తో రచించిన పాట నీలి నీలి ఆకాశం అనే పాట.అయితే ఈ పాటను చంద్రబోస్ ఆ సింగర్ పాడితేనే బాగుంటుందని భావించి ఆమెతోనే పాడించాలని పట్టుపట్టారట రైటర్ చంద్రబోస్.ఆమె మరెవరో కాదు ఎవరి పాట వింటే ఊహాలోకంలో విహరిస్తామో, మనల్ని మనం మైమరచిపోయి పాటను ఎంజాయ్ చేస్తామో ఆవిడే సింగర్ సునీత… ఈ పాట రాసే అప్ప్పుడు తన మదిలో సింగర్ సునీత గాత్రం మాత్రమే మెదిలిందని,ఆమె పాడితెనె ఈ పాటకు జీవం వస్తుందని భావించి ఆ పాటను సినిమాలో ఆమె చేతనే పాడించాలని మ్యూజిక్ డైరక్టర్ అనూప్ రూబెన్స్ తో గొడవ కూడా పెట్టుకునేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.అనుకున్నట్లే ఆ పాటను సునీత పాడారు.

చంద్రబోస్ సునీత మీద పెట్టుకున్న నమ్మకాన్ని వొమ్ము చేయలేదు.

ఆ పాట ఎంత హిట్ అయిందంటే మాటల్లో చెప్పలేము.సినిమా ఎలా ఉన్నాగాని ఆ పాట మాత్రం మారుమోగిపోయింది.

యూట్యూబ్ లో ఏకంగా సంచలనంగా నిలిచింది.అయితే సింగర్ సునీత కూడా చంద్రబోస్ చేసిన ఈ వ్యాఖ్యలపై స్పందించినట్లు తెలిసింది.

తన కెరీర్ లో ఎంతో మంది రచయితల పాటలకు పాటలను పాడి వాటికి ప్రాణం పోశానని, కానీ నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా అనే పాట మాత్రం తనకు ఎంతో ప్రత్యేకమైనదని ఆమె గుర్తుచేసుకున్నారు.

Telugu Anoop Rubens, Chandra Bose, Sunitha, Sreya, Veerapaneni Ram-Latest News E

ఈ పాటను ఇంత పెద్ద హిట్ అవటంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు.ఇప్పటిదాకా పాడిన పాటలు ఎంత పేరు తెచ్చిపెట్టాయో అలాగే నీలి నీలి ఆకాశం పాట అంతకన్నా గొప్ప పేరు తెచ్చిపెట్టింది.అని ఆమె తెలిపారు.

అంతేకాకుండా తాజాగా వివాహం చేసుకున్న రాం వీరపనేని, సునీత జంటను చంద్రబోస్ గారి ఆశీర్వదించారు.అలాగే సునీత భర్త అయిన రామ్ వీరపనేనికి సైతం సునీత పాడిన ఈ పాట అంటే చాలా ఇష్టం అంట.ఇకమీదట సునీత సైతం ఇలాంటి పాటలను ఎంపిక చేసుకొని పాడాలనుకుంటున్నట్లు తెలుస్తుంది.అలాగే సునీత కూతురు కూడా పాటలు బాగానే పాడుతుంది.

తనకి కూడా ఇలాంటి పాటలంటే చాలా ఇష్టమని పలుమార్లు తెలిపింది.కూతురు శ్రేయకు కూడా ఇలాంటి మంచి పాటలు పాడే అవకాశాలు దక్కాలని సునీత అనుకుంటుందట.!!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube