15 రోజుల్లో 'ఇండియన్‌ 2' పూర్తి కాకుంటే శంకర్‌ పరిస్థితి ఏంటీ?

తమిళ సినీ దర్శక దిగ్గజం శంకర్ పెద్ద సమస్యలో చిక్కుకున్నాడు.ఆయన ఇండియన్ 2 సినిమా ను పూర్తి చేసేందుకు లైకా వారికి ఒప్పందం ఇచ్చాడు.

 Lyca And Director Shankar Issue Going Very Serious-TeluguStop.com

ఆ ఒప్పందం ప్రకారం సినిమా ను ఈ జూన్‌ వరకు పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది.జూన్‌ నెల మరో 15 రోజుల్లో రాబోతుంది.

అంటే ఈ 15 రోజుల్లో ఇండియన్ 2 సినిమా ను పూర్తి చేయాల్సి ఉంటుంది.అలా పూర్తి చేయకుంటే లైకా వారు భారీ మొత్తంలో శంకర్ నుండి నష్టపరిహారంను వసూళ్లు చేసే అవకాశం ఉంటుంది.

 Lyca And Director Shankar Issue Going Very Serious-15 రోజుల్లో ఇండియన్‌ 2’ పూర్తి కాకుంటే శంకర్‌ పరిస్థితి ఏంటీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దానికి తోడు వారు ఖర్చు చేసిన మొత్తం బడ్జెట్‌ ను కూడా వారు శంకర్‌ నుండి రికవరీ చేసే అవకాశం ఉంటుంది.వారు రాసుకున్న అగ్రిమెంట్‌ ప్రకారం అయితే ఖచ్చితంగా కోర్టు కూడా శంకర్ కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

తమిళ స్టార్‌ దర్శకుడు అయిన శంకర్‌ లైకా ప్రొడక్షన్స్ వారితో ఉన్న గొడవలు మరియు ఇతరత్ర వివాదాల కారణంగా ఇండియన్ 2 ను మద్యలో వదిలేవాడు.

లైకా వారు సినిమా నిర్మాణం కు ముందుకు వస్తున్నా కూడా శంకర్ మాత్రం ఆసక్తి చూపడం లేదు.

ఈ విషయంలో ఇరు వైపుల ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ఇండియన్ 2 సినిమా బాధ్యతలను కమల్‌ తీసుకుంటాడనే వార్తలు కూడా వచ్చాయి.మొత్తానికి ఇండియన్ 2 సినిమా షూటింగ్‌ మళ్లీ మొదలు అవ్వడం మాత్రం కష్టంగా ఉంది.అయినా కూడా లైకా వారు తమ సినిమా ను పూర్తి చేయకుండా మరే సినిమా ను కూడా శంకర్ మొదలు పెట్టేందుకు వీలు లేదు అంటూ కోర్టుకు వెళ్లారు.

ఇటీవలే రామ్‌ చరణ్‌ తో దిల్‌ రాజు బ్యానర్‌ లో ఒక సినిమాను చేసేందుకు శంకర్ సిద్దం అయ్యాడు.ఆ సినిమా ను ఆపేయాల్సిందే అంటూ టాలీవుడ్ నిర్మాతల మండలికి లైకా వారు లేఖ రాశారు.

మరో వైపు బాలీవుడ్‌ అపరిచితుడు రీమేక్ ను కూడా ఆపాలంటూ శంకర్ తో సినిమా ను చేసేందుకు సిద్దం అయిన నిర్మాతలకు లైకా వారు లేఖ రాయడం జరిగింది.మొత్తానికి లైకా వారితో శంకర్ గొడవ ముదురుతుంది.

ఇండియన్ 2 సినిమా ను ముగించకుంటే శంకర్ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏంటీ అంటూ అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

#Lyca #Shankar #Kamal Haasan #ShankarAnd #Corurt

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు