వామ్మో: ఆకర్షణీయంగా ఉండే ఫేస్ షీల్డ్ ఎంతో తెలుసా...?

ప్రస్తుత రోజుల్లో కరోనా వైరస్ పుణ్యమా అని మాస్క్, శానిటైజర్ లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.కరోనా వైరస్ నుంచి కొద్ది మేర తప్పించుకోవడానికి వీటిని ప్రతి నిత్యం వాడాల్సి వస్తుంది.

 Louis Vuitton Launches A $960 Luxury Face Shield,  Face Shield, Louis Vuitton, C-TeluguStop.com

ఇప్పటికే ప్రజల్ని ఆకర్షించుకోవడానికి వివిధ రకాలుగా మాస్క్, ఫేస్ మాస్క్ లను తయారు చేస్తున్నాయి అనేక కంపెనీలు.అంతేకాదు కొన్ని కంపెనీలు సౌకర్యవంతంగా ఉండే వాటిని కూడా తయారుచేసి మార్కెట్లోకి తీసుకు వస్తున్నాయి.

ఇక ఇందులోనే భాగంగా లూయిస్ విత్తోన్ అనే కంపెనీ 2021 క్యూరియస్ కలెక్షన్స్ లో భాగంగా కొన్ని ప్రత్యేకమైన ఫేస్ మాస్క్ లను తయారు చేసింది.అయితే ఇందులో LV ట్రిమ్ తో ఉన్న ప్లాస్టిక్ ను ఉపయోగించి వీటిని తయారు చేశారు.

ఇక ఈ ఫేస్ మాస్క్ లను చూపరులకు చూడటానికి ఎంతో అందంగా తీర్చిదిద్దారు.వీటిని ధరించడానికి తల రిబ్బన్ మాదిరిగా కట్టు కోవడానికి వీలుగా ఉండేందుకు నూతనంగా రూపొందించారు.

ఇక ఫేస్ మాస్క్ కు అంచులు, రిబ్బన్ గా ఉన్న బట్టపై సేమ్ టు సేమ్ డిజైన్ ని ఏర్పాటు చేశారు.ఇక వీటిని అతి త్వరలో మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు.

ఇక ఈ ఫేస్ మాస్క్ ల ధర విషయానికి వస్తే.ఏకంగా 960 డాలర్లకు కాస్త అటూ ఇటూ ఉండవచ్చని తెలుస్తోంది.

ఇదే మన భారత కరెన్సీలో ఏకంగా 60 వేల వరకు ఉండవచ్చు.ఇంతలా ఖర్చు చేయడానికి గల కారణం ఈ ఫేస్ మాస్క్ ధరించడం తో కరోనా వైరస్ నుంచి చాలా వరకు రక్షణ పొందవచ్చని, అంతేకాకుండా ఇది ధరించినప్పుడు చల్లగా ఉండే విధంగా తీర్చిదిద్దాలని కంపెనీ తెలుపుతోంది.

అంతేకాకుండా ఇవి చూడటానికి చాలా స్టైలిష్ గా కనబడతాయని అలాగే వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుందని కంపెనీ యాజమాన్యం తెలుపుతోంది.ఇంకా కొంతమంది డబ్బులు ఉన్నవారు మాస్క్ లను వజ్రాలతో చెప్పించుకుంటున్న సంగతి మనకి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube