కరీనా కపూర్ లగ్జరీ కారు కొట్టేసిన కేరళ వ్యాపారి.. అసలు ఏం జరిగిందంటే?

సాధారణంగా ఎంత పెద్ద వారైనా కానీ, లేదా ఎంతో తెలివి తేటలు ఉన్నవారైనా ఎక్కడో ఒక చోట మోసపోతూనే ఉంటారు.ఈ క్రమంలోనే ఈ విధంగా ఎంతో మంది సెలబ్రిటీల నుంచి మొదలుకొని సాధారణ వ్యక్తుల వరకు తరచూ మోసగాళ్ల చేతిలో మోసపోతూనే ఉన్నారు.

 Luxury Car Seized From A Fake Antique Dealer In Kerala Registered Under Kareena-TeluguStop.com

ఈ క్రమంలోనే కరీనాకపూర్ లగ్జరీ కారును కేరళ వ్యాపారి కొట్టేశారని గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.అసలు కరీనా కపూర్ కారును కేరళ వ్యాపారి ఎలా దొంగతనం చేశారు.

అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే.

గత కొన్ని సంవత్సరాల క్రితం లోకల్ మేడ్ మెటీరియల్తో పురాతన చరిత్ర కలిగి ఉందని,ఎంతోమంది రాజకీయ నాయకులను పోలీసులను సినీ సెలబ్రిటీలను తన మాయ మాటలతో నమ్మించి మోసం చేసిన ఘనత మోన్‌సోన్ మవుంకల్ అనే వ్యక్తికి ఉందని చెప్పవచ్చు.

ఈయన ఈ విధమైనటువంటి మోసాలకు తెరలేపి గతంలో వార్తల్లో నిలిచాడు.జుడాస్ వెండి, టిప్పు సుల్తాన్ రాజసింహాసనం లాంటి ఐకానిక్ వస్తువులు ఇప్పటికీ తన దగ్గర ఎంతో భద్రంగా ఉన్నాయి అంటూ తన మాటల ద్వారా అందరినీ నమ్మించి కోట్లకు దోచుకున్నారు.

Telugu Bollywood, Antique Dealer, Karrena Kapoor, Kerala, Luxury Car-Movie

ఈ విధంగా పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతూ అందరినీ మోసం చేసి డబ్బులు పోగు చేసుకుంటున్నా ఇతన్ని 2017వ సంవత్సరంలో ఇతను ఏకంగా పది కోట్ల మోసానికి పాల్పడినట్టు పోలీసులు అతనిని అరెస్టు చేసి జైలుకు పంపారు.మళ్లీ ఇప్పుడు హెడ్ లైన్స్ టచ్ చేశాడు.బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్‌ పేరు మీద రిజిస్టర్ అయిన కారు(2007 మోడల్ పోర్‌శ్చే బాక్స్‌టర్)ను పోలీసులు కేరళలో తన దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు.ఈ క్రమంలోనే ఈ కారు తన వద్దకు ఎలా వచ్చింది అనే విషయం గురించి పోలీసులు విచారణ చేస్తూ.

కారు డాక్యుమెంట్లను పరిశీలించగా అందులో ఫాదర్ కాలం కింద రణబీర్ కపూర్ పేరు ఉంది.అదేవిధంగా కరీనాకపూర్ ముంబై ఇంటి అడ్రస్ మెన్షన్ చేసి ఉందని పోలీసులు పేర్కొన్నారు.

అయితే ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ చేయకుండా మోన్‌సోన్ ఈ కారును ఎలా స్వాధీనం చేసుకున్నారు అనే విషయం గురించి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube