గంటలో ప్రయాణించి.. నిండు ప్రాణం నిలిపారు !

ట్రాఫిక్ పోలీసులు, విమానయాన శాఖ అధికారుల సమన్వయంతో ఓ నిండు ప్రాణాన్ని కాపాడారు.ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడటానికి పెద్ద సాహసమే చేశారు అధికారులు.

 Lungs Airlifted From Pune To Hyderabd,kims Heart And Lung Transplant Institute,-TeluguStop.com

పూణె నుంచి హైదరాబాద్ కు గంటలోనే ప్రయాణించి బాధితుడి ప్రాణాలు కాపాడారు.సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో ఓ వ్యక్తి ఊపిరితిత్తుల సంబంధింత వ్యాధితో బాధపడుతున్నాడు.

హార్ట్ అండ్ లంగ్స్ ట్రాన్స్ ప్లాంట్ ఇనిస్టిట్యూట్ లో వైద్యం చేయించుకుంటున్నాడు.అవయవ మార్పిడి కోసం బాధితుడి కుటుంబ సభ్యులు జీవన్ దాన్ ఫౌండేషన్ లో రిజిస్టర్ అయ్యారు.

ఈ తరుణంలో పూణేలో ఓ వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయి చికిత్స పొందుతున్నాడు.అతడి కుటుంబ సభ్యులు అవయవదానం చేసేందుకు ముందుకు రావడంతో తెలంగాణ జీవన్ దాన్ ఫౌండేషన్ ఇన్ చార్జ్ ఆధ్వర్యంలో బాధితుడి కుటుంబ సభ్యులను కలిశారు.

బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి టెస్టులు నిర్వహించి కరోనా పాజిటివ్ రావడంతో ఆ వ్యక్తి ఊపిరితిత్తులు తీసుకొచ్చేందుకు రెడీ అయ్యారు.ఇన్ టైంలో ఆపరేషన్ చేయడానికి 560 కి.మీ.ప్రయాణించాలి.దీంతో పూణే, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, భారత విమానాశ్రమ ప్రాధికార సంస్థ అధికారుల సహకారంతో కేవలం గంటలోనే చేరుకున్నారు.ఆదివారం ప్రత్యేక విమానంలో ఊపిరితిత్తులను బేగంపేట ఎయిర్ పోర్టు తీసుకొచ్చి, అక్కడి నుంచి కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

వైద్యులు బాధితుడికి ఊపిరితిత్తులు అమర్చి సర్జరీ విజయవంతంగా పూర్తి చేసి ప్రాణాలు కాపాడారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube