ఈ నెల 19న చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి?

ఈ ఏడాది చివరి చంద్రగ్రహణంగా ఈ నెల 19వ తేదీ ఏర్పడి నుండి.అయితే చంద్రగ్రహణం ఎంతో పవిత్రమైన కార్తీక మాసం రోజు ఏర్పడనుంది.

 Lunar Eclipse On The 19th Of This-month Are These Zodiac Signs Very Careful Luna-TeluguStop.com

అయితే ఈసారి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడటంవల్ల భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో మాత్రమే ఈ చంద్రగ్రహణం ఏర్పడినట్లు తెలుస్తోంది.ఈ ఏడాదిలో చివరిగా వచ్చే ఈ చంద్రగ్రహణం ఎంతో అశుభం అని జ్యోతిష్యలు చెబుతున్నారు.ఈ క్రమంలోనే ఈ గ్రహణ ప్రభావం అన్ని రాశుల వారిపై ఉంటుందని ముఖ్యంగా ఈ 2 రాశులవారు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు తెలియజేస్తున్నారు.

వృషభ రాశి:

నవంబర్ 19వ తేదీ ఏర్పడే చంద్రగ్రహణం వృషభ రాశి వారిపై అధిక ప్రభావం చూపిస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే రాహువు వృషభరాశిలో ఉండటంవల్ల ఈ గ్రహణ ప్రభావం ఈ రాశి వారిపై అధికంగా ఉంటుంది.ఈ క్రమంలోనే ఈ రాశివారు ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి.

ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించిన ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.మీ నిర్ణయం వల్ల కుటుంబ సభ్యులు మొత్తం బాధపడటమే కాకుండా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

సింహరాశి: ఈ చంద్రగ్రహణం కృత్తిక నక్షత్రంలో ఏర్పడటంవల్ల ఈ రాశికి అధిపతి సూర్యుడు కనుక సూర్యుడుతో సంబంధం ఉన్న అన్ని రాశుల వారిపై ఈ చంద్రగ్రహణం ప్రభావం ఏర్పడనుంది.సింహరాశి కూడా సూర్యునికి సంకేతం కనుక ఈ చంద్రగ్రహణం సింహ రాశి వారిపై అధిక ప్రభావం చూపిస్తుంది.

ఈ రాశి వారికి వారి పై అధికారులతో గొడవలు పడే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి.ఈ తొందరపాటు తనం వల్ల ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితులు కూడా తలెత్తుతాయి కనుక ఏ విషయంలోనూ సింహ రాశి వారు తొందర పడకూడదని ప్రతి విషయంలో ఎంతో నిదానంగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube