పశువులను వెంటాడుతున్న ‘లంపీ స్కిన్’ వ్యాధి

మూగజీవాలకు ‘లంపీ స్కిన్’ వ్యాధి వెంటాడుతోంది.ఒక జీవి నుంచి మరో జీవికి ఈ వైరస్ వేగంగా సోకుతుండటంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది.

 Lumpy Skin Disease Spreading To Animals, Telangana, Adilabad, Animals, Lumpy Ski-TeluguStop.com

రాష్ట్రంలో పశువైద్యశాలల్లో వైద్యుల కొరత, సరైన మందులు అందుబాటులో లేకపోవడంతో సమస్య మరింత జఠిలంగా మారింది.ఈ లంపీ స్కీన్ డిసీజ్ మే, జూన్ నెలల్లో వనపర్తి జిల్లాలో వ్యాప్తి చెంది అనేక జంతువుల ప్రాణాలు తీయగా.

ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాను గడగడలాడిస్తోంది.

గత నెల రోజులుగా లంపీ స్కిన్ వ్యాధి ఆదిలాబాద్ లో వ్యాప్తి చెందుతోంది.

ఈ వ్యాధి బారిన పడిన పశువుల చర్మంపై బొబ్బలు, బొడిపెలు వస్తుంటాయి.తొలిదశలోనే ఈ వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తే వ్యాధిని సులువుగా అరికట్టవచ్చని పశు వైద్యులు పేర్కొంటున్నారు.

లింపీ స్కిన్ డిసీజ్ ఎక్కువగా ఆవులు, ఎద్దులు, దూడలకు సోకుతుందని వైద్యులు తెలిపారు.ప్రభుత్వ పశు వైద్యశాలల్లో ఈ వ్యాధికి టీకాలు అందుబాటులో లేవు.దీంతో రైతులు ఒక్కో పశువుకి రూ.1500 పెట్టి మందులు కొనాల్సిన పరిస్థితి.ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రభుత్వం టీకా సరఫరాను నిలిపివేడంతో రైతులకు భారంగా మారింది.ఆదివారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో ఓ ఎద్దు లంపీ స్కీన్ డిసీజ్ తో చనిపోవడంతో రైతులు కలవరపడుతున్నారు.

జూన్ నెలలో వనపర్తి జిల్లా మదనపురం మండలం అజ్జకోలు గ్రామంలో 11 జంతువులు ఈ వ్యాధి బారిన పడి మృతి చెందాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube