టాయిలెట్లు క్లీన్ చేసిన వ్యక్తి... ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌ స్థాయికి: ఆస్ట్రేలియాలో భారతీయుడి విజయగాథ

తినడానికి తిండి లేని స్థాయి నుంచి కోట్లాది మంది కడుపు నింపే స్థాయికి చేరిన వారి ఉదంతాలు మనం ఎన్నో చూశాం.నిరాశా నిస్పృహలతో జీవితాన్ని సాగించలేక లోలోపల కుమిలిపోతున్న వారికి ఇలాంటి వారి ఉదంతాలు ఒక పాఠం.

 Punjab Man Set To Become Officer In Australian Air Force,  Australian Air Force,-TeluguStop.com

అచ్చం అలాంటి స్థాయి నుంచే ఓ ఉన్నత స్థానానికి ఎదిగి నలుగురికి ఆదర్శంగా నిలిచాడో భారతీయుడు.

పంజాబ్‌లోని లూధియానాకు చెందిన తజిందర్ కుమార్ హైస్కూల్ చదువును పూర్తి చేసిన తర్వాత ఓ ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ సంస్థలో మెకానికల్ ఫిట్టర్‌గా ట్రైనింగ్ తీసుకున్నాడు.

అయితే తన విద్యార్హతలకు సరిపడినంత ఉద్యోగం అతనికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో దొరకలేదు.దీంతో విదేశాలకు వెళ్లి ఉపాధిని వెతుక్కుందామని తజిందర్ నిర్ణయించుకుని ఆస్ట్రేలియాకు వెళ్లాడు.

Telugu Australia, Australianair, Punjabset, Royalaustralian, Tajinder Kumar-

దేశం కానీ దేశంలో కడుపు నింపుకునేందుకు గాను మొదట షాపింగ్ మాల్స్‌లో టాయిలెట్లు క్లీన్ చేసే పని చేశాడు.ఇదే సమయంలో అక్కడ పరిచయమైన వారి ద్వారా రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్‌ఫోర్స్‌ (రాఫ్)లో జరిగే రిక్రూట్‌మెంట్ గురించి తెలుసుకున్నాడు.ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రాఫ్‌కు దరఖాస్తు చేసుకుని ఏవియేషన్ మెయింటినెన్స్‌లో ఉత్తీర్ణత సాధించారు.

తర్వాత 2017లో మెల్‌బోర్న్‌లో ఆఫీసర్ ట్రైనింగ్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం ద్వారా రాఫ్‌కు రిక్రూట్ అయ్యారు.

ప్రస్తుతం తజిందర్ కుమార్ సీ-130 ట్రాన్స్‌పోర్ట్‌లో ఏవియానిక్స్ టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube