అదృష్టవంతులు: ఇంటి గోడలో 100 ఏళ్ల నాటి పురాతన విస్కీ బాటిళ్లు..!

మనలో చాలామందికి తెలిసిన వారికి, లేకపోతే మరి ఎవరో అయినా సరే వారి పాత ఇండ్లను రీ మోడల్ చేపించుకొనే నేపథ్యంలో అప్పుడప్పుడు వారి పాత ఇంట్లో ఏదో ఒక పాత వస్తువులు బయట పడుతూ ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం.తాజాగా ఓ జంట ఇల్లు కొనుక్కొని చక్కగా ఉందామని వచ్చిన దంపతులకు ఆ పాత ఇంటి గోడలలో ఉన్న వాటిని చూసి నిజంగా షాక్ అయ్యారు.

 100 Year Old Whiskey Bottles On The Wall Of The House, Lucky, 100 Years, Old Bot-TeluguStop.com

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

అమెరికాలోని న్యూయార్క్ నగరానికి చెందిన నిక్, పాట్రిక్ అనే జంట గత నెల రోజుల క్రితం ఓ పాత ఇండ్లను చాలా ఇష్టపడి ఇంటిని కొనుక్కున్నరు అయితే దానిని పాత ఇంటి లాగానే ఉంచుకోకుండా రీ మోడల్ చేద్దామని రిపేర్లు మొదలుపెట్టారు.

ఇలా రిపేర్లు చేస్తున్న నేపథ్యంలో వారికి అనుకోకుండా గోడ మధ్యలో ఏకంగా 66 విస్కీ బాటిల్స్ వారి కంట పడ్డాయి.ఆ దంపతులు ఇద్దరు ఆ బాటిళ్లను చూసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ షాక్ కు గురయ్యారు.

వీరిద్దరు ఆ ఇంటిని నటోరియస్‌ స్మగ్లర్ దగ్గరనుంచి కొనుగోలు చేశారు.ఆ ఇల్లు నిజానికి వంద సంవత్సరాల పైగా ముందే నిర్మాణం జరిగింది.అయితే రీ మోడల్ చేస్తున్న నేపథ్యంలో ఆ ఇంటి గోడలను బాగుచేయడానికి బాగా పాడైపోయిన గోడల్ని తప్పించడానికి ప్రయత్నం చేశారు.

ఇందులో భాగంగానే వారికి ఓ గోడ లోపల వరుసగా పేర్చి ఉన్న విస్కీ బాటిల్స్ వారి కంటపడ్డాయి.మొదటగా వారికి ఒక బాటిల్ కంటపడిన తర్వాత మరికొన్ని ఉంటాయన్న భావించిన వారికి ఒకటి తర్వాత ఒకటి ఏకంగా 66 విస్కీ బాటిల్స్ బయటికి వచ్చాయి.ఇదివరకు కాలంలో మద్యనిషేధం నడిచిన కాలానికి చెందినవిగా వారు గుర్తించారు.

అయితే ఆ దంపతులు ఇద్దరు వారికి దక్కిన అదృష్టాన్ని తలుచుకొని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ దంపతులు ఈ వీడియోని షేర్ చేస్తూ ” మా ఇంటిని మద్యం బాటిల్ తో నిర్మించారు ” అనే క్యాప్షన్ తో విడుదల చేశారు.ఇకపోతే ఈ బాటిల్లపై తయారు తేదీ కూడా వాటిపై రాసిపెట్టి ఉంది.

ఈ 66 బాటిళ్లలో 13 బాటిల్స్ మాత్రమే నిండుగా ఉన్నాయి.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube