నా భార్య కొడుతోంది కాపాండి అంటూ పోలీసులకు ఫోన్‌.. ఇదే ప్రథమం కాదు భార్య బాధితుల లెక్క చూస్తే అవాక్కవుతారు

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని ఠాకుర్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌కు ఒక వ్యక్తి ఏడ్చుకుంటూ వచ్చాడు.అతడి ఏడుపును చూసి స్టేషన్‌లో ఉన్న కానిస్టేబుల్స్‌ మరియు ఇతరులు అయ్యో పాపం అనుకున్నారు.

 Lucknow Man Accuses Wife Of Attacking Him-TeluguStop.com

ఏమైందంటూ అతడి వద్దకు వెళ్లి అడిగారు.అతడి ఏడుస్తూనే ఉన్నాడు.

ఎస్సై వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అంటూ గట్టిగా ప్రశ్నించడంతో అతడు నోరు తెరిచ్చాడు.నా భార్య దారుణంగా కొడుతోంది, ఆమె చిత్ర హింసలు తాళలేక పోతున్నాను అన్నాడు.

అతడి మాటకు స్టేషన్‌లో ఉన్న వారు అంతా కూడా షాక్‌ అయ్యారు.

-->

లక్నోలో మాత్రమే కాదు ఇలాంటి కేసులు ఇండియా మొత్తంలో భారీగానే నమోదు అవుతున్నాయి.భార్యల చేతిలో దెబ్బలు తిన్నాం అంటూ ఎంతో మంది పోలీసుల ముందుకు వస్తున్నారు.తమకు న్యాయం చేయాలని, తమను రక్షించాలంటూ మీడియా ముందుకు వస్తున్నారు.

తాజాగా ఠాకుర్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన వ్యక్తి పరిస్థితి మరీ దారుణం.ఆయన భార్య ఇంట్లో పెట్టి తలుపులు వేసి మరీ కొడుతుందట.

ఆమె కొట్టిన కొట్టుడికి ఒక చేయి కూడా అతడిది విరిగింది.

-->

ఆమె చేతికి అందిన వస్తువును మీదకు విసిరేయడంతో పాటు ఇష్టం వచ్చినట్లుగా మొహంపై, పొట్టలో పిడిగుద్దులు గుద్దుతుందని, ఆమె బలం ముందు తాను తట్టుకోలేక పోతున్నట్లుగా అతడు పోలీసులకు తెలియజేశాడు.పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎంక్వౌరీ మొదలు పెట్టారు.ఆమెను అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

భార్యలు కొడుతున్నారని భర్తలు పోలీస్‌ స్టేషన్‌లో ఇస్తున్న ఫిర్యాదుల సంఖ్య షాకింగ్‌గా ఉంటుంది.సంవత్సరం సంవత్సరం పెరుగుతుంటే ముందు ముందు భర్తల పరిస్థితి ఏంటా అనే భయం వేస్తోంది.2016వ సంవత్సరంలో ఇలాంటి కేసులు 19 నమోదు అయ్యాయి.2017 లో 30, 2018 పూర్తి కాకుండానే 41 నమోదు అయ్యాయి.వచ్చే ఏడాదికి వందలో పడుతాయేమో అనుమానంగా ఉంది.ఆడవారిపై దాడుల గురించి విన్నాం.కాని ఇప్పుడు రివర్స్‌లో జరుగుతున్నాయి.ఈ పరిస్థితి మరెంత దూరం వెళ్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube