ల‌క్‌ అంటే ఈ ఆటో డ్రైవ‌ర్‌దే.. రాత్రికి రాత్రే రూ.12కోట్లు..

అదృష్టం అంటే ఎప్పుడు ఎలా త‌లుపు త‌డుతుందో ఎవ‌రికీ అర్థం కాదు.ఏదో అనుకుంటో ఇంకేదో కూడా జ‌రుగుతుంది.

 Luck Means This Auto Driver .. Rs 12 Crore Per Night   12 Crores, Lottery , Thir-TeluguStop.com

ఇక చాలా సార్లు సామాన్యులు కూడా అదృష్టం కొద్ది రాత్రికి రాత్రి కోటీశ్వ‌రులు అవుతున్న ఘ‌ట‌న‌లు కూడా మ‌నం చాలానే చూస్తున్నాం.ఇక ఇప్పుడు కూడా ఓ ఆటో డ్రైర‌వ్ కు ప‌ట్టిన అదృష్టం గురించి మ‌నం చెప్పుకోబోతున్నాం.

కేర‌ళ‌లో ఓనం పండుగ సదర్భంగా నిర్వ‌హించిన లాటరీలో ఆయ‌న‌కు ల‌వ్ త‌గిలింది.ఇంకేముంది ఆటో నడుపుకుంటూ బ‌తుకుతున్న ఆయ‌న ఇప్పుడు ఏకంగా కోటీశ్వ‌రుడు అయిపోయారు.

ఇక లాట‌రీ విధానంలో ఆయ‌న కూడా అంద‌రిలాగే ఓ టికెట్ కొనుక్కున్నాడు.ఇక త‌న‌కు వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం లేక‌పోయినా కూడా ఒక‌సారి ప్ర‌య‌త్నిద్దామ‌ని అనుకున్నాడు.కానీ అనూహ్యంగా ఆయ‌న‌కు లాటరీలో రూ.12 కోట్లు వ‌చ్చి రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుడు అయ్యాడు.ఇక తిరుఓనం బంపర్‌ లాటరీ నిర్వ‌హించిన యాజ‌మాన్యం దాని ఫలితాలను ఆదివారం విడుద‌ల చేయ‌గా రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లాకు చెందిన‌టువంటి మరాడులో నివ‌సిస్తున్న జయపాలన్ కొన్న టికెట్‌కు ఈ అదృష్టం ప‌ట్టింది.ఆయ‌న కొన్న టీఈ-645465 నంబరు టికెట్ సెల‌క్ట్ అయింది.

Telugu Jayapalan, Lottery, Yarnakulam-Latest News - Telugu

ఇంకేముంది ఆనందంతో ఆయ‌న కొన్న లాట‌రీ టికెట్‌ను స్థానికంగా ఉండే కెనరా బ్యాంక్‌కు వెళ్లి చూపించ‌గా అంద‌రూ షాక్ అయిపోయారు.ఇక తాను ఈ నెల 10న త్రిప్పునితురలో ఈ లాట‌రీ టికెట్‌ను కొనుగోలు చేయ‌గా దానికే ఆఫ‌ర్ ద‌క్కింద‌న్నాడు.అయితే ఈ ఒక్క టికెట్ తో పాటే వేరే టికెట్లను కొన్నా వాటికి రాలేద‌ని, తాను ఊహించ‌న‌ట్టుగానే దీనికి వ‌చ్చింద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.ఇక లాట‌రీలో రూ.12 కోట్లలో వివిధ ర‌కాల పన్నులు పోగా మిగిలిన మొత్తాన్ని ఆయ‌న‌కు అంద‌జేసిన‌ట్టు బ్యాంకు సిబ్బంది వివ‌రించారు.ప్ర‌స్తుతం ఈ న్యూస్ వైర‌ల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube