లూసీఫర్ రీమేక్ కోసం రారాజు టైటిల్ పరిశీలిస్తున్న దర్శకుడు

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు.కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

 Lucifer Remake Title As Raraju, Tollywood, Acharya Movie, Megastar Chiranjeevi,-TeluguStop.com

ఈ సినిమాలో నక్శలైట్ పాత్రలో చిరంజీవి నటిస్తున్నాడు.ఇక రామ్ చరణ్ తో కలిసి ఈ సినిమాలో చిరంజీవి సందడి చేయబోతున్నాడు.

దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.ఇదిలా ఉంటే ఆచార్య తర్వాత మలయాళీ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ రీమేక్ మీద చిరంజీవి దృష్టి పెట్టబోతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.ఇందులో చిరంజీవితో పాటు మరో హీరోకి కూడా ఛాన్స్ ఉంది.

అయితే ఆ పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేస్తారనేదానిపై చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.ఇదిలా ఉంటే మేనెలలోనే లూసీఫర్ రీమేక్ షూట్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇప్పటికే దానికోసం భారీ హౌస్ సెట్ ని కూడా ఏర్పాటు చేశారు.ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఇప్పుడు రారాజు అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు టాక్ నడుస్తుంది.

అయితే ఇదే టైటిల్ తో 2006లో గోపీచంద్ ఒక సినిమా చేశాడు.ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.గోపీచంద్ కెరియర్ లో ఇదొక వేస్ట్ మూవీగా మిగిలిపోయింది.అయితే ఇప్పుడు అదే టైటిల్ ని చిరంజీవి సినిమాకి వాడటంపై మెగా ఫ్యాన్స్ కొంత అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు కూడా కమర్షియల్ లెక్కలు వేసుకొని, ప్రేక్షకులు అతని నుంచి ఎలాంటి అంశాలు ఆశిస్తారో అలాంటి సినిమాలే ఎక్కువగా చేస్తూ ఉంటారు.మరి లూసీఫర్ కి కోసం పరిశీలిస్తున్న రారాజు టైటిల్ గురించి మెగాస్టార్ అభిప్రాయం ఏంటి అనేది ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

చిరంజీవి ఇమేజ్ కి ఎలాంటి టైటిల్ పెట్టిన అది వర్క్ అవుట్ అవుతుందనే అభిప్రాయం టాలీవుడ్ సినీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube