లూసిఫర్ రీమేక్‌ను అఫీషియల్‌గా మొదలెట్టిన మెగాస్టార్  

Lucifer Remake Launched Officially, Chiranjeevi, Lucifer, Remake, Mohan Raja, Thaman, Tollywood News - Telugu Chiranjeevi, Lucifer, Mohan Raja, Remake, Thaman, Tollywood News

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఆచార్య చిత్రంపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

TeluguStop.com - Lucifer Remake Launched Officially

ఇక ఈ సినిమా పూర్తిగాక ముందే చిరు తన నెక్ట్స్ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు.కాగా ఈ క్రమంలో ఆయన మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ఎంతో ఆసక్తిని చుపుతున్నాడు.

అయితే తొలుత ఈ సినిమా డైరెక్షన్ బాధ్యతలను యంగ్ డైరెక్టర్ సుజీత్‌కు అప్పగించగా, కొన్ని కారణాల వల్ల ఆయన ఈ సినిమా నుండి వాకౌట్ చేశాడు.ఆ తరువాత వివి వినాయక్‌ను ఈ సినిమా కోసం అనుకున్నా, కొన్ని కారణాల వల్ల చివరకు తమిళ దర్శకుడు మోహన్ రాజాకు ఈ సినిమాను తెరకెక్కించే అవకాశం దక్కింది.

TeluguStop.com - లూసిఫర్ రీమేక్‌ను అఫీషియల్‌గా మొదలెట్టిన మెగాస్టార్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమాను జనవరి 20న అఫీషియల్‌గా లాంఛ్ చేశారు చిత్ర యూనిట్.

ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు దర్శకుడు మోహన్ రాజా, మెగా బ్రదర్ నాగబాబు, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తదితరులు పాల్గొన్నారు.

పూర్తి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో చిరు ఓ కొత్త లుక్‌లో మనకు కనిపిస్తాడు.

ఇక మలయాళ వర్షన్ సినిమాలో హీరోయిన్ పాత్ర లేదు.కానీ తెలుగులో హీరోయిన్ పాత్రను పెట్టేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

మరి లూసిఫర్ చిత్ర రీమేక్‌తో చిరంజీవి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది.ఏదేమైనా ఆచార్య తరువాత మరో సినిమాను మెగాస్టార్ లైన్‌లో పెడుతుండటంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

#Mohan Raja #Lucifer #Chiranjeevi #Thaman #Remake

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు