ఇక జోరుగా హుషారుగా షికారు

‘జోరుగా హుషారుగా షికారు పోదమా…హాయి హాయిగా తీయ తీయగా…’ అని పెళ్లికాని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా పాడుకోవచ్చు.ఎందుకిలా పాడుకోవడం అనుకుంటున్నారా? లీవ్‌ ట్రావెల్‌ కన్సెషన్‌ (ఎల్‌టీసీ) నిబంధనను కేంద్ర ప్రభుత్వం మార్చింది.ఇప్పటివరకు ఈ సౌకర్యం అవివాహితులకు కొంత పరిమితి ఉండేది.పెళ్లయినవారు పిల్లా పాపలతో దేశంలోని ఏ ప్రాంతానికైనా ఎల్‌టీసీ మీద వెళ్లే వెసులుబాటు ఉంది.కాని అవివాహితులు వారి హోం టౌన్‌కు అంటే సొంత ఊరికి మాత్రమే వెళ్లే అవకాశం ఉండేది.దేశంలోని నాలుగు ప్రాంతాలు చూసిరావాలంటే వారి సొంత డబ్బులు పెట్టుకొని పోవల్సిందే.

 Ltc Rules Changed-TeluguStop.com

వివాహితులకు ఓ నిబంధన, అవివాహితులకు ఓ నిబంధన ఏమిటని కేంద్ర ప్రభుత్వం ఆలోచించినట్లుంది.వివాహితులను ఎందుకు చిన్నబుచ్చడమని వారు కూడా ఎల్‌టీసీపై దేశంలోని ఏ ప్రాంతినికైనా వెళ్లవచ్చని సడలింపు ఇచ్చింది.

ఎల్‌టీసీ సౌకర్యం కింద ప్రభుత్వం ఉద్యోగులు ఎక్కడికి వెళ్లినా రాను పోను ప్రయాణ ఛార్జీలు చెల్లిస్తుంది.మొత్తం మీద కేంద్రం అవివాహిత ఉద్యోగుల అభిమానం పొందింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube